ఎన్నికల సమరం..త్రిముఖ పోరు..!

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసినే. ఈ క్రమంలో ఈ సారి అధికారం దక్కించుకోవడం కోసం బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిలు హోరాహోయిగా తలపడనున్నాయి. అయితే ప్రధాన పోరు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే నడుస్తుంది. ఒక 20-30 స్థానాల్లో బి‌జే‌పి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మూడు పార్టీలు ప్రజా క్షేత్రంలోకి దిగాయి. ఓ వైపు అధికార బి‌ఆర్‌ఎస్ మూడోసారి అధికారం దక్కించుకోవడం […]

పాత మిత్రుల మధ్య చిగురించిన కొత్త స్నేహం…!

పైకి పొత్తులు… లోపల మాత్రం కడుపులో కత్తులతో నిన్న, మొన్నటి వరకూ స్నేహం చేసిన బీజేపీ, జనసేన నేతలు పాత వైరానికి స్వస్తి పలికారు. అధ్యక్షుడు మారిన వెంటనే కొత్త స్నేహానికి తెరలేపారు. చాలా రోజుల తరువాత రాజకీయంగా అరుదైన దృశ్యం కనిపించింది. పంచాయితీల నిధుల మళ్లింపు, సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం పై అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు బీజేపీ ఇచ్చిన ధర్నా పిలుపునకు జనసేన కూడా మద్దతు పలికింది. జనసేన, బీజేపీ జెండాలు ధర్నా […]

మళ్లీ ఆ ముగ్గురు కలుస్తారా… కాంబో సాధ్యం అవుతుందా…!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 కాంబినేషన్‌ రిపిట్ కానుందా… ఏపీలో తిరిగి 2014 నాటి మిత్రపక్షం అధికారంలోకి వస్తుందా… అంటే పరిస్థితి అవుననే అనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగనప్పటికీ… టీడీపీ, బీజేపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచారం […]

తిరుపతి లడ్డూ వివాదం… కాంగ్రెస్ – బీజేపీ వార్…!

అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ తయారీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య వివాదానికి తెర లేపింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి దాదాపు 50 ఏళ్లుగా కర్ణాటక పాల సరఫరా సమాఖ్య ఆవు నెయ్యి సరఫరా చేస్తోంది. ఒక దశలో తిరుమల లడ్డూకు అంత రుచి రావడానికి కారణం కర్ణాటక పాల సరఫరా సమాఖ్య సరఫరా చేసే నందిని బ్రాండ్ ఆవు నెయ్యి అని గతంలో తిరుమల తిరుపతి […]

ఏపీ అప్పులపై కేంద్రం అలా..పురందేశ్వరి ఇలా..ఏది నిజం.!

ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చేశారని, ఈ నాలుగేళ్లలో దాదాపు ఏపీ అప్పులు 10 లక్షల కోట్లకు చేరాయని చెప్పి  టి‌డి‌పి, జనసేన, బి‌జే‌పిలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయాక సుమారు లక్ష కోట్ల వరకు అప్పులు ఉంటే..చంద్రబాబు హయాంలో  2 లక్షల కోట్లపైనే అప్పులు చేశారని చెప్పుకొచ్చారు. ఇక జగన్ వచ్చాక దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శలు వస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం 2 లక్షల కోట్లు లోపే […]

మళ్లీ పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్న ఆలనాటి హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించింది హీరోయిన్ జయసుధ.. రాజకీయాలలో కూడా తన మార్క్ చూపిస్తోంది.. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన జయ సుధ ప్రస్తుతం ఆ పార్టీ వైపు చూస్తున్నట్లుగా అసలు కనిపించడం లేదు.. పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఆయా పార్టీలలోని ప్రజలలో మమేకమై ఎందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అంతేకాకుండా పార్టీలోనే మార్పులు చేర్పులు కూడా చాలా […]

బండి సంజయ్‌ను పూర్తిగా పక్కన పెట్టినట్లేనా….!

బండి సంజయ్… తెలంగాణలో ఓ ఫైర్ బ్రాండ్… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గుర్తింపు వచ్చిందంటే.. అది బండి వల్లే అనేది బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు ఒక లెక్క… ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా… బండి సంజయ్‌కు ముందు సైలెంట్‌గా ఉన్న బీజేపీ… రాష్ట్ర అధ్యక్షునిగా బండి బాధ్యతలు చేపట్టిన తర్వాత… ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఎంపీగా ఉన్న బండి.. పార్టీని గాడిలో పెట్టారనేది అక్షర సత్యం. సీనియర్ల మాట వింటూనే… […]

దేశంలో బీజేపీ సర్కార్ హ్యాట్రిక్ సాధ్యమేనా…!?

దేశంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 2014లో లోక్ సభలో తొలిసారి కాలుపెట్టిన మోదీ… వరుసగా రెండు సార్లు ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నమో నినాదంతో తొలిసారి, అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ రెండోసారి ఎన్డీయే సర్కార్ ఏర్పాటయ్యింది. ఇక మూడోసారి కూడా గెలుపు తమదే అని బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిస్థితి మాత్రం ఆ స్థాయిలో లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. […]

కమలంలో ఆరని చిచ్చు..మాజీ సీఎంతో చిక్కులు.!

తెలంగాణ బి‌జే‌పిలో అంతర్గత పోరు ఆగేలా లేదు..బండి సంజయ్‌All Postsని అధ్యక్ష పదవి నుంచి తప్పించక ముందు నుంచి కమలంలో చిచ్చు రగులుతుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన స్టేజ్ పైనే బి‌జే‌పిలో విభేదాలు కనిపించాయి. ఈ క్రమంలో బండి సంజయ్..సొంత పార్టీలోని కొందరు నేతలని టార్గెట్ చేసి..జాతీయ నాయకత్వానికి తనపై కొందరు లేనిపోని ఫిర్యాదులు చేశారని, ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని హితవు పలికారు. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని అన్నారు. అయితే బండిని […]