మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్ కూడానా..? వామ్మో ఈ ట్వీస్ట్ ఏంటి రా బాబు..!

మహేష్ బాబు – రాజమౌళితో ఒక సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకే రాలేదు. ఆ మాటకొస్తే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు..కానీ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకి సంబంధించిన వార్తలు రకర రకాలుగా ట్రెండ్ అవుతున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లాంచింగ్ పూజా కార్యక్రమాలు కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా మే 30వ తేదీన జరగబోతున్నాయట . ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ నెట్టింట లీకై వైరల్ గా మారింది .

ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రియాంక చోప్రా – జాన్వి కపూర్ – ఇండోనేషియన్ బ్యూటీ . ఈ సినిమాలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . అయితే ఈ సినిమాలో ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ కూడా నటించబోతున్నారట . వాళ్ళిద్దరూ ఈ సినిమా కథను మలుపు తిప్పే పాత్రగా ఉండబోతున్నాయట . ఆ ఇద్దరు మరెవరో కాదు సిమ్రాన్ .. అదేవిధంగా జ్యోతిక అంటూ ప్రచారం జరుగుతుంది . ఇద్దరు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్.. ఒకప్పుడు తమ అందచందాలతో ఇండస్ట్రీని ఏలేసి ఇప్పుడు సీనియర్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు.

మరీ ముఖ్యంగా సిమ్రాన్ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జ్యోతిక మాత్రం ఓ రేంజ్ లో అదరగొట్టేస్తుంది . అయితే రాజమౌళి పర్సనల్గా వెళ్లి సిమ్రాన్ ఈ సినిమాలో రోల్ కోసం ఒప్పించాడట . అదే విధంగా జ్యోతిక కూడా కంటెంట్ నచ్చితే ఆ సినిమాను ఓకే చేస్తుంది. రాజమౌళి సినిమాను ఏ హీరోయిన్ అయినా వదులుకోగలదా..? అందుకే ఇద్దరు కూడా ఓకే చేశారట . మొత్తంగా ఐదు మంది స్టార్ బ్యూటీలు ఈ సినిమాలో నటించబోతున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. చూద్దాం మరి దీనిపై రాజమౌళి – మహేష్ బాబు ఏ విధంగా స్పందిస్తారో..?