అరెరె..ఆ సినిమా పవన్ – బాలయ్య కాంబోలో రావాల్సిందా..? జస్ట్ మిస్..వచ్చుంటే కెవ్వు కేక అంతే..!

సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వైరల్ కూడా అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాము. కాగా రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటి సంపాదించుకున్న బాలయ్య ..ఇద్దరికీ సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి.

 

ఇద్దరికీ ఇద్దరే బడా హీరోలు.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని రాజ్యమేలేస్తున్నారు . అయితే ఈ హీరోలు కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తే చూడాలి అనేది కోట్లాదిమంది అభిమానుల కోరిక . అది ఎప్పుడు నెరవేరుతుందో ఎవరికీ తెలియడం లేదు . అయితే వీళ్ళ కాంబోలో చాలా సినిమాలు రావాల్సి ఉన్నాయట . కానీ కొన్ని కొన్ని కారణాల చేత అవి మిస్ అయ్యాయట. మరీ ముఖ్యంగా వీళ్ళ కాంబోలో రావాల్సి ఉండి మిస్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా గోపాల గోపాల అంటూ తెలుస్తుంది .

వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకున్నింది. అంతేకాదు ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ మనకి దేవుడు గెటప్ లో కనిపిస్తాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ – పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే డైలాగ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే ఈ పాత్ర కోసం ముందుగా బాలకృష్ణని చూస్ చేసుకున్నారట మేకర్స్. కథ విన్న బాలయ్య ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసారట . దేవుడు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నప్పుడు పక్కన సపోర్టింగ్ పాత్రలో మేము కనిపిస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అన్న కారణం చేతనే ఆయన ఈ పాత్రను రిజెక్ట్ చేశారట .