భయానికి కొత్త నిర్వచనం ఒక డార్క్, డేంజరస్ హారర్ థ్రిల్లర్ ..!

హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే మరో ఆసక్తికరమైన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 Media మరియు Maha Movies సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం “Production No. 4”గా రూపొందుతోంది. “Inspired by True Events” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా, నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్నదనే ఆసక్తిని పెంచుతోంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్‌‌తో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పోస్టర్‌లో కనిపిస్తున్న గాఢమైన చీకట్లు, భయానక చిహ్నాలు, మిస్టీరియస్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తూ ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.


ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్, ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు మంచి స్పందన లభించగా, చిత్ర యూనిట్ రేపు అధికారిక టైటిల్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది. ప్రీ లుక్ పోస్టర్‌‌తో టైటిల్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ సినిమా సాంకేతిక బృందం విష‌యానికి వ‌స్తే బ్యానర్: M3 Media, Maha Movies – సమర్పణ : మహర్షి కూండ్ల
నిర్మాత: మహేంద్రనాథ్​ కూండ్ల – కథ – దర్శకత్వం: సూర్యాస్ – లిరిక్స్ : ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ – మ్యూజిక్ డైరెక్టర్ : అచ్చురాజమణి – డీఓపీ: మిర్లాన్ నసీర్ – ఎడిటింగ్: వంశీ – పిఆర్‌ఓ: జీకే మీడియా (గణేష్ – కుమార్).