విజ‌య‌వాడ వైసీపీలో గంద‌ర‌గోళం.. ఎవ‌రు ఎక్క‌డ‌…?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో విజ‌య‌వాడ న‌గ‌రానికి ఉండే క్రేజ్ వేరు. విజ‌య‌వాడ న‌గర రాజ‌కీయాల్లో ప‌ట్టు కోసం ప్ర‌ధాన పార్టీలు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాయి. గ‌త నాలుగైదు ద‌శాబ్దాల్లో ఎంతో మంది మ‌హామ‌హులైన వారు విజ‌య‌వాడ న‌గ‌రం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఏపీలో మిగిలిన ప్రాంతాల నుంచి చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎంపిక కావ‌డం ఒక ఎత్తు అయితే.. విజ‌య‌వాడ నుంచి గెల‌వ‌డం మ‌రో ఎత్తు.. విజ‌య‌వాడ రాజ‌కీయాల‌కు ఉండే ఆకర్ష‌ణ అలాంటిది. అలాంటి కీల‌క న‌గ‌రంలో ప‌ట్టు సాధించ‌డంలో వైసీపీ త‌డ‌బ‌డుతోంది. జ‌గ‌న్ మూడు ఎన్నికల్లోనూ విజ‌య‌వాడ న‌గ‌రంపై గ్రిప్ తెచ్చుకోలేక‌పోయారు. తాజాగా విజ‌య‌వాడ న‌గ‌ర వైసీపీలో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏంటి ? అస‌లు బెజ‌వాడ వైసీపీలో ఏం జ‌రుగుతోందో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి..