చిన్న హీరో – పెద్ద సహాయం

– నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

BEWARS, SODHARA సినిమాలతో గుర్తింపు పొందిన యువ నటుడు Sanjosh తన SANJOSH FOUNDATION ఆధ్వర్యంలో 18 – 05 – 2026న ఏటూరు నాగారంలో ఘనంగా స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ములుగు జిల్లా మరియు గిరిజన ప్రాంతాలకు చెందిన 10వ తరగతిలో 500కు పైగా మార్కులు, ఇంటర్మీడియట్‌లో 900కు పైగా మార్కులు సాధించిన 118 మంది గిరిజన మరియు దిగువ మధ్యతరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹2,000 చొప్పున నగదు స్కాలర్‌షిప్ అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం అందించి, వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించారు.


ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు Sampoornesh Babu ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
కార్యక్రమానికి ASP మనన్ భట్ IPS, పూజారి నాగేశ్వరరావు, DEO సిద్ధార్థ్ రెడ్డి, MEO మల్లిక్ తదితర ప్రముఖులు హాజరై నటుడు Sanjosh చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇంతకుముందు కూడా SANJOSH FOUNDATION ద్వారా గిరిజన ప్రాంతాల్లో 168 ఉచిత మొబైల్ కంటి క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు నిర్వహించారు.


అలాగే పేద విద్యార్థులకు టైలు, బెల్టులు, షూస్, ఎగ్జామ్ కిట్లు అందజేస్తూ, ముగ్గురు విద్యార్థుల చదువుకు వ్యక్తిగతంగా సహాయం చేస్తున్నారు. సమాజ సేవలో ముందుండి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నటుడు Sanjosh చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి.