బాబు అరెస్ట్‌.. వైసీపీకి ప్లస్‌ ఆర్ మైనస్‌…?

చంద్రబాబు అక్రమ అరెస్టుపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురు కావడంతో వైసీపీలో మంట పెరిగింది. ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏపీలోని అన్ని పక్షాలతోపాటు.. జాతీయ నేతలు.. మీడియా కూడా చంద్రబాబు అరెస్టుపై విరుచుకుపడటంతో ఏం చేయాలో తోచని స్థితికి చేరుకుంది. దీంతో ఏకంగా సజ్జల వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచిన వ్యవహారం […]

ఆసక్తిగా మంగళగిరి సమీకరణాలు… టీడీపీకి లాభమా… నష్టమా…!

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం… తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన నియోజకవర్గం ఇదే అంటే అతిశయోక్తి కాదేమో. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో పాటు… ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం కావడం కూడా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ప్రజాక్షేత్రంలో దిగిన లోకేశ్… ఓటమితోనే సరిపెట్టుకున్నారు. అయితే మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తా అంటూ బల్లగుద్ది మరీ […]

పల్నాడు వైసీపీ నేతల్లో స్థాన చలనం తప్పదా…!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక ప్రాంతమైన పల్నాడు జిల్లాలో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్షాల అధినేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి సమీప జిల్లా కావడంతో… ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ… అభ్యర్థుల ఎంపికపైన ప్రధాన పార్టీలు తలమునకలై ఉన్నాయి. అధికార పార్టీలో అయితే సిట్టింగ్ అభ్యర్థుల మార్పు తప్పదనే పుకార్లు సైతం ఇప్పటికే షికార్లు చేస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలోని […]

శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఫుల్ క్లారిటీ…!

రాబోయే ఎన్నికల్లో గెలుపే వైసీపీ ప్రధాన లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే ఇప్పటికే పార్టీ నేతలకు వై నాట్ 175 అంటూ టార్గెట్ పెట్టారు. ఇదే సమయంలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలపై కూడా జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో టాప్ ప్లేస్‌లో ఉన్నది శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం. వరుసగా రెండు సార్లు ఓడిన ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి […]

రుషికొండలో ఏం కడుతున్నారో తెలుసా….?

రుషికొండ… గతేడాది వరకు విశాఖ వాసులకు మాత్రమే బాగా తెలిసిన ప్రాంతం. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతున్న ప్రదేశం. విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న ప్రాంతం రుషి కొండ. వైసీపీ ప్రభుత్వం ఆ కొండను తవ్వేసి ఏదో కడుతోందని ఇప్పటి వరకు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిని పరిశీలించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా రుషికొండకు వెళ్లారు కూడా. అయితే పోలీసు ఆంక్షల కారణంగా […]

పొలిటికల్ “గేమ్ ఛేంజర్”గా పవన్.. “ప్రేమ వాలంటీర్” తో “పవర్” మారుతుందా…?

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హిట్ పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు అసలు మాకు ఈ రాజకీయాల గోల వద్దు అనుకున్న వాళ్లు కూడా 2024 లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరు సీఎం పదవిని చేపడతారు అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు నిన్న మొన్నటి వరకు పవన్ […]

ఏపీ రాజకీయాల్లో సడెన్ ఛేంజ్..పవన్ కళ్యాణ్ ని తొక్కేయడానికి NTR ని దింపుతున్నారా..!? కలవరపెడుతున్న కొత్త ఫ్లెక్సీ..!!

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత వేడి పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు టిడిపి – వైసిపిల మధ్య టఫ్ కాంపిటీషన్ నడిచింది. అయితే ఎవ్వరు ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ ని స్థాపించి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు . ఈ క్రమంలోని ఇన్నాళ్లు రాజకీయాలలో టాప్ పొజిషంగా ఉన్న ఏ టిడిపి – వైసిపి పార్టీలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు జన సైనికులు . […]

ఆ పదవులతో ఎమ్మెల్యేలకు చిక్కులు..గ్రాఫ్ డౌన్..!

అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుయ బాగోలేదని స్వయంగా జగన్ చెప్పిన విషయం తెలిసిందే. పనితీరు బాగోని వారిని పక్కన పెట్టేసి..వారి స్థానాల్లో కొత్త అభ్యర్ధులని బరిలో దించుతామని జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే పనితీరు బాగోలేదని 18 మంది ఎమ్మెల్యేల గురించే మాట్లాడారు గాని…ఆ పార్టీలో దాదాపు 50 మంది వరకు పనితీరు బాగోలేదని తెలిసింది. దీంతో జగన్ ఎంతమందికి టికెట్లు ఇవ్వకుండా ఉంటారో అర్ధం కాకుండా ఉంది. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు..పార్టీ […]

జ‌గ‌న్ రూట్లోనే చంద్ర‌బాబు కూడా… పేటెంట్ రైట్స్ ఎవ‌రికి…?

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకూడా సంక్షేమం బాట‌ప‌ట్టారు. ఇటీవ‌ల జ‌రిగిన రెండు రోజుల మహానాడులో చివ‌రిరోజు ఆయ‌న సంక్షేమ అజెండాను భారీ స్థాయిలో ఆవిష్క‌రించారు. దీంతో సంక్షేమం విష‌యంపై వైసీపీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సంక్షేమానికి వైసీపీ చిరునామా అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించ‌గా.. అస‌లు సంక్షేమం ఎన్టీఆర్, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిల‌దేన‌ని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. దీంతో సంక్షేమ ఎవ‌రి పేటెంట్‌? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ప్ర‌జ‌ల‌కు […]