మోడీకి పవన్ కళ్యాణ్ – చిరంజీవి అంటే ఎందుకంత ఇష్టం..? స్టేజి పైన ఏం చేసాడో చూడండి..!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ చిరంజీవి అంటే ఎందుకంత ఇష్టం..? కేవలం ఒక్క సందర్భంలో కాదు ఎన్నెన్నో సందర్భాలలో ఆయన చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు . పెద్ద పెద్ద మంత్రులు ఉన్నా సరే వాళ్ళను పట్టించుకోకుండా చిరంజీవి – పవన్ కళ్యాణ్ లకు స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడుని సైతం పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ చిరంజీవిలను స్పెషల్గా ట్రీట్ చేయడం అభిమానానికి షాకింగ్ గా అనిపించింది.

అదేవిధంగా మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని స్వయంగా చిరంజీవి వద్దకు తీసుకెళ్లి అక్కడ ఇద్దరి చేతులను పైకి లేపుతూ దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా పలకరించారు . ఆ మూమెంట్ చూసిన మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో అరుపులతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయేలా చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ బుగ్గను టచ్ చేస్తూ చిరంజీవి సైతం ఎమోషనల్ అయ్యారు .

చిరంజీవి – నరేంద్ర మోడీ – పవన్ కళ్యాణ్ కలిసి దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. స్టేజ్ పై ఎంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నా.. చాలా చాలా మంది ప్రధానమంత్రి కి కావాల్సిన వాళ్ళు ఉన్నా.. కానీ వాళ్ళు ఎవ్వరిని పట్టించుకోకుండా స్ట్రైట్ గా చిరంజీవి దగ్గరికి వెళ్లి అలా పవన్ కళ్యాణ్ తో చిరునవ్వుతో ఫోటో దిగడం ఇప్పుడు అభిమానులకు సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే మొదటి నుంచి చిరంజీవి – పవన్ కళ్యాణ్ విధివిధానాలను నరేంద్ర మోడీ ఇష్టపడతాడు అని.. ఆ కారణంగానే వాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి..!!