ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ… ఇదే ట్రెండ్‌…!

నిన్నటి వరకూ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న చందంగా ఉన్న బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు.. ఇటీవల నువ్వా, నేనా అన్న రీతిలో మారాయి. వైసిపి నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మద్యం, ఇసుక వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన బీజేపీ.., విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లేఖ రాసింది. ఇదిలా […]

వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై రాష్ట్ర ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తోంది. రెండురోజుల క్రితం మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేయగా, తాజాగా ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని మరో కేసు నమోదు చేశారు. ఇలా వరుస కేసులతో చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తూ ఆయనను జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని ప్రభుత్వం వ్యూహం రూపొందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ను అధికార […]

ఆ సీటు కోసం వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి ప్రయత్నం…!

గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి బలహీనవర్గాలంటే గిట్టేది కాదనే మాట బలంగా వినిపిస్తోంది. బీసీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ చైర్మన్లకు అధికార కార్యక్రమాలకు ఆహ్వానాలు అందేవికావు. కనీస గౌరవం ఇచ్చే వారు కాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించేవారు కాదు. కానీ ఇప్పుడా ఎమ్మెల్యే బలహీనవర్గాల నినాదాన్ని అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా మార్పు రావడానికి కారణం ఏంటి..? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం అన్ని పార్టీలకు కీలకం. ఈ స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యే […]

ఏపీలో బీజేపీ అడుగులు ఎటు వైపు…?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కలిసి వస్తారా.. లేక ఫ్యాన్ కిందే సేద తీరుతారా.. అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ తీరు ప్రస్తావనకు వచ్చింది. జగన్ పై ప్రేమను చంపుకోలేక, టీడీపీని కాదనలేక బీజేపీ నేతలు డైలమాలో ఉన్న విషయాన్ని తెలుగుదేశం నేత ప్రస్తావించారు. ఎన్‌డీఏలో కొనసాగుతున్న పవన్‌ కల్యాణ్‌ కు ఏం చెప్పాలో అర్థంకాక కమలనాథులు సమతమవుతున్నారని […]

బాలినేని అలకకు కారణం అదేనా…!

ఒంగోలు వైసీపీలో ముసలం పుట్టింది… సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే గన్‌మెన్‌లను సరెండర్‌ చేసిన బాలినేని తాజాగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డితో భేటీ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్‌ చేశారు. సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఉదయమే తాడేపల్లి చేరుకున్న బాలినేని సాయంత్రం […]

జగన్ వ్యూహం ట్రైలర్ వైరల్..!!

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసిన సరే ఒక సెన్సేషనల్ గా మారుతూ ఉంటుంది. గతంలో ఎలక్షన్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి పెను సంచలనాలని సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎలక్షన్ టైం కి వ్యూహం అని ఒక పొలిటికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జగన్ కి సంబంధించిన కథ అంశం కావడం చేత ఈ సినిమా పైన ప్రతి ఒక్కరు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వ్యూహం సినిమాని […]

బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి గారు ఫిక్స్ అయ్యారా….?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఎన్నికలుంటాయని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికలకు ఇంక కేవలం 5 నెలలు మాత్రమే సమయం ఉందనేది నేతల మాట. ఈ నేపథ్యంలో నేతలంతా ఇప్పటి నుంచి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే నేతలు ఇప్పటి నుంచే ఓటర్లు ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సుమారు 50 మందికి పైగా సిట్టింగ్‌లకు టికెట్ లేదని ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం […]

చంద్రబాబు అరెస్ట్‌… టీడీపీ అనుకూలించలేదా…?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు క్రమంగా మరుగున పడుతున్నట్లుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో భారీ స్కామ్‌ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతో… 24 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో… సుప్రీం కోర్టు గడప తొక్కారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. అదే సమయంలో చంద్రబాబుకు […]

బాబు కేసులో మలుపులు..సీన్ రివర్స్.!

చంద్రబాబు కేసుల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బాబుకు అనుకూలంగా ఎలాంటి తీర్పులు రావడం లేదు. దీంతో టి‌డి‌పి శ్రేణులు నిరాశలో ఉన్నాయి. ఇప్పటికే ఆయన కోసం టి‌డి‌పి శ్రేణులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. కానీ అనుకున్న విధంగా మాత్రం పోరాటం ఫలించడం లేదు. అటు కోర్టుల్లో బాబుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే హైకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ కొట్టేశారు. అటు సి‌ఐ‌డి కస్టడీలో 2 రోజుల పాటు విచారించి..మళ్ళీ అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించారు. […]