అధినేత మాటంటే లెక్కే లేదా…!

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. పార్టీ అధినేత చెప్పిందే ఫైనల్. పార్టీ లైన్ దాటిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అయినా సరే… అధినేత చంద్రబాబు వెనుకడుగు వేయరనేది సీనియర్ నేతలకు బాగా తెలుసు. అయితే కొందరు జూనియర్ నేతల తీరు వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి, పార్టీకి, అధినేత చంద్రబాబుకు కూడా చెడ్డ పేరు వస్తోంది. తొలి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న నేతలంతా ఇప్పటికీ పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటున్నారు. కానీ మధ్యలో […]

మేము సైతం… మీ కోసం…!

బుడమేరు… చిన్నదే… కానీ చేసిన నష్టం మాత్రం మాటల్లో చెప్పలేనంత. ప్రభుత్వం అధికారికంగా రూ.6,880 కోట్లు అని లెక్క తేల్చింది. ఇదంతా రహదారులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వరద సాయం, పంట నష్టం.. అని లెక్క తేల్చింది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. వేలాది కుటుంబాలు వరద బారిన పడ్డాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లు నీటి ముంపునకు గురైంది. […]

పెద్దాయనకు తలనొప్పి తెప్పిస్తున్న సత్తిబాబు….!

దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించటం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత… ఎక్కువగా సంబరాలు జరుపుకుంది తెలుగుదేశం పార్టీ నేతలే. ఐదేళ్ల పాటు వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడిన తమకు పార్టీ అండగా ఉంటుందని ఆశ పడ్డారు. అయితే కొందరు కిందిస్థాయి కార్యకర్తల తీరు…. ఐదేళ్లుగా కేసులు ఎదుర్కొన్న వారికి… ఎంతో వ్యయప్రయాసలతో కాలం గడిపారు. అలాంటి వారంతా తమ నేతను కలిసేందుకు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారనేది బహిరంగ రహస్యం. […]

ఆ పార్టీల్లో వారికి గుర్తింపు తక్కువేనా….!

తెలుగుదేశం పార్టీ అంటే.. అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే కులం కమ్మ. వాస్తవానికి ఏపీలో ఒక్కొ పార్టీనీ ఒక్కో కులం సొంతం చేసుకుందనటంలో సందేహం లేదు. టీడీపీని చౌదరీలు, జనసేనను కాపులు, వైసీపీని రెడ్డి సామాజిక వర్గం సొంతం చేసుకుంది. ఈ పార్టీ మాది అని గొప్పగా ప్రకటించుకుంటున్నారు కూడా. అయితే ఇప్పుడు ఆయా పార్టీలకు సొంత సామాజిక వర్గాలే దూరమవుతున్నాయనటంలో సందేహమే లేదు. ఇంకా చెప్పాలంటే.. అధినేతలే ఆయా వర్గాలను నిర్లక్ష్యం చేయడం వల్ల కొందరు […]

అవును.. అక్కడ వాళ్లదే రాజ్యం….!

దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదనేది సామెత… ఇప్పుడు ఈ సామెత ప్రస్తుత ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనితకు సరిగ్గా సరిపోతుంది. ఐదేళ్ల పాటు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కొనసాగిన సమయంలో నానా మాటలు పడ్డారు. ఇక ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు కూడా. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగు మహిళలు ఎంతో అండగా నిలిచారు. కించపరిచేలా అనితపై వైసీపీ ట్రోలర్స్ పోస్టులు పెట్టినప్పుడు కూడా అనితకు అండగా నిలిచింది తెలుగు మహిళలే. ఇక అనిత […]

పదవీ కాలం ముగిసింది…. అయినా అధికారంలో ఎలా…?

పదవి వ్యామోహం ఏ స్థాయిలో ఉంటుందో… ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదవి కోసం పార్టీలు మారే వాళ్లు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. నిన్నటి వరకు తిట్టిన నోటీతోనే… పదవి ఇచ్చిన పార్టీ నేతను ఆకాశానికి ఎత్తేస్తుంటారు కూడా. ఇక పదవిలో ఉన్న వారు అయితే… నిబంధనలను కూడా గాలికి వదిలేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా సరే… పదవి కోసం కావాల్సిన అడ్డదార్లు అన్నీ తొక్కేస్తున్నారు కూడా. పార్టీ అధికారంలో లేకపోయినా సరే… తనదే పెత్తనం అంటున్నారు […]

ఏపీలో నామినేటెడ్ పదవులపై ఫుల్ క్లారిటీ…!

ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం తారాస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా నిండకముందే… పదవుల కోసం నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా పదవుల కేటాయింపులో కూడా ఈసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలనే విషయంపై ఇప్పటికే ఓ అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో పదవుల కేటాయింపు విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా […]

పనిచేశాం… పదవులివ్వండి సార్…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ గెలుపు కూడా ఎలా ఉందంటే… ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంలో 24 మందికి మంత్రి పదవులు దక్కాయి. వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం కొత్త మంత్రులతో కళకళలాడుతోంది. శాఖల కేటాయింపు పూర్తి కావడంతో.. మంత్రులంతా తమకు కేటాయించిన ఛాంబర్‌లలో మార్పులు […]

వాళ్లేం చేస్తారో నాకేం తెలుసు.. భార్యాపిల్లలపై వైసీపీ అభ్యర్థి మాట..!

చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి మాత్రం ఉన్నట్లుగా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలే ఏకైక కార్యక్రమంగా పెట్టుకుని పెత్తనం చేసిన వైసీపీ నేతల తీరు గురువింద గింజలను తలపిస్తుంది. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటి అంటే చెప్పుకోవడానికి ఒకటి లేకపోయినా… అరాచకాల జాబితా మాత్రం పెద్దగానే ఉంది. ఇంతకాలం ఇతరులను మాత్రమే వైసిపి నేతలు ఇబ్బందులు పెట్టారని అంతా అనుకున్నారు. కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత గాని వీళ్ళ అసలు స్వరూపం […]