స్టేజీ పై రజనీకాంత్ తో చిరంజీవి ఆ మాట అన్నాడా..? వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే మారు మ్రోగిపోతుంది. దానికి కారణం కూడా మనకు తెలిసిందే . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్ధి పై భారీ ఓట్ల మెజారిటీతో గెలిచి ఇప్పుడు మినిస్టర్ గా ప్రమాణస్వీకారం కూడా చేశారు. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగవసారి నారా చంద్రబాబు నాయుడు .. ఫస్ట్ టైం మినిస్టర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు . దీనికి సంబంధించిన పిక్స్ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .

కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. తమ్ముడు ప్రమాణ స్వీకారోత్సవానికి స్పెషల్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి తన పక్కనే ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ తో మాట్లాడిన పిక్స్ ని మీమ్‌స్ గా క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు . అఫ్ కోర్స్ ఈ ప్రమాణస్వీకార ఉత్సవానికి మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వెళ్ళింది . మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంత స్థానానికి చేరుకున్నాడు. అయితే రజనీకాంత్ పక్కనే చిరంజీవి కూర్చొని తన తమ్ముడి సైడు వేలు చూపిస్తూ మాట్లాడుతున్న పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . దీనిని మీమ్‌స్ చేసి ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు.

చిరంజీవి హీరోగా సౌందర్య హీరోయిన్ గా రవితేజ బ్రదర్ పాత్రలో నటించిన సినిమా అన్నయ్య . ఈ సినిమాలో తన తమ్ములను పొగిడేస్తూ చిరంజీవి సౌందర్యకు చెబుతూ నా తమ్ముళ్లు జేమ్స్ అండి జేమ్స్ అని తెగ పొగిడేస్తారు . అదేవిధంగా ఇక్కడ కూడా రజనీకాంత్ కు నా తమ్ముడు జేమ్ మడి జేమ్ అని చెప్తున్నటువంటి పిక్చర్ను బాగా ట్రెండ్ చేస్తున్నారు . దానికి రజనీకాంత్ ఎన్ని సార్లు చెప్తావయ్యా .. ఇప్పటికే వందసార్లు చెప్పావు అంటూ రిప్లై ఇచ్చిన విధంగా మీమ్.. బాగా క్రియేట్ చేశారు . ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం ఉత్సవం చేస్తున్నప్పుడు ఎంతమంది ఆనందపడ్డారో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తండ్రి స్థానంలో తన తమ్ముడు విజయాన్ని చూసి ఆనందపడ్డారు అన్నది మాత్రం వాస్తవం. స్టేజిపై అందరూ చూస్తూ ఉండగానే చిరంజీవి కాళ్లకు నమస్కరించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!!