సైలెంట్ గా ఆ పని చేసిన యూట్యూబర్ షణ్ముఖ జస్వంత్.. ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదుగా.!

షణ్ముఖ్ జస్వంత్ .. ఈ పేరు గురించి ప్రత్యేక చెప్పాలా..? ప్రముఖ యూట్యూబర్.. నెంబర్ వన్ యూట్యూబర్.. ఇది ఒకప్పటి మ్యాటర్ ..ఒకప్పుడు షణ్ముఖ్ జస్వంత్ పేరు చెప్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలకి మించిన రేంజ్ లో అరుపులు కేకలు ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపించేది ..వినిపించేది . ఇప్పుడు సీన్ మారిపోయింది. హా వాడా అంటూ అరగంటసేపు సాగదీసేస్తున్నారు జనాలు . దానికి కారణం బిగ్ బాస్ అన్న విషయం తెలిసిందే .

బిగ్ బాస్ లోకి వెళ్లిన షణ్ముఖ్ జశ్వంత్ హౌస్ లో నడిపిన ప్రేమాయణం నడుచుకున్న తీరు అస్సలు ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు . దీంతో ఆయన విన్నర్ అవ్వాల్సింది రన్నర్ గా నిలిచాడు . ఆ తర్వాత ఎంత ట్రైన్ చేసినా సరే పోగొట్టుకున్న పేరు మాత్రం తిరిగి దక్కించుకోలేకపోయాడు. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ షణ్ముఖ్ జశ్వంత్ యాక్టివ్ గా మారుతున్నారు. కొన్ని నెలల క్రితం గంజాయి కేసులు అరెస్ట్ అయ్యి.. సంచలనానికి కారణమైన విషయం తెలిసిందే .

అప్పటినుంచి సోషల్ మీడియాలో చాలా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. తాజాగా హీరోగా సినిమాకి ఓకే చేశాడు . ఇప్పటికే మెయిన్ లీడ్ గా వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ చేసిన షణ్ముఖ్..ఇప్పుడు పూర్తి స్థాయిలో హీరోగా నటిస్తున్నాడు. షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా అసమ అజిత్ హీరోయిన్గా పవన్ కుమార్ అనే దర్శకుడు ఈటీవీ విన్ కోసం డైరెక్ట్ చేస్తున్నారు . ఈ సినిమాని శ్రీ అఖియన్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు . ఈ సినిమాకి వివేకా ఆత్రేయ స్క్రిప్ట్ అందించడం హైలైట్ గా మారింది . ఈ సినిమాకి సంబంధించిన లాంచింగ్ పూజా కార్యక్రమాలు కు సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!