ప్రమాణ స్వీకారోత్సవంలో అరుదైన దృశ్యం… పండగ చేసుకుంటున్న మెగా – నందమూరి ఫ్యాన్స్..!

నేడు నాలుగవసారి సీఎం గా చంద్రబాబు నాయుడు .. మొట్టమొదటిసారి మినిస్టర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడడానికి ఎంతో మంది జనాలు తరలివచ్చారు. మరి ముఖ్యంగా ఒకవైపు మెగా కుటుంబం మరోవైపు నందమూరి కుటుంబం అందరూ వచ్చి ఈ వేడుకను ఫుల్ సక్సెస్ చేశారు . కేంద్ర మంత్రులు ..పలు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకకి హైలైట్ గా నిలిచారు.

అయితే స్టేజీ పై వాళ్లు ఎంత హైలెట్గా నిలిచారో.. స్టేజ్ కింద కుర్చీలో కూర్చొని ఉన్న కుటుంబ సభ్యులకు కూడా అంతే హైలెట్ గా నిలిచారు. మరి ముఖ్యంగా ఈ ప్రమాణస్వీకారం చాలా చాలా హైలేట్ గా నిలిచింది. ఎప్పుడు కూడా రామచరణ్ తన పనిలో తాను బిజీ గా ఉంటాడు. బాలయ్య కూతురు నారా బ్రాహ్మణిని సైతం తన పనిలో తాను ఉంటుంది. ఇద్దరు కలిసింది చాలా చాలా తక్కువ..

అస్సలు జనాలు చూడలేదనే చెప్పాలి. అయితే వీరిద్దరూ పక్కపక్కనే కలిసి కూర్చొని మాట్లాడుకున్న పిక్చర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయ్. నారా బ్రాహ్మణిని భర్త లోఖేష్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. తండ్రి బాలయ్య కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు . మామగారు ఏకంగా ఏపీ సీఎం గా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేశారు. ఇక రామ్ చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ పొలిటికల్ గేమ్ చేంజర్ గా మారిపోయాడు . దీంతో ఇప్పుడు నారా బ్రాహ్మిణి – రామ్ చరణ్ పక్క పక్కనే ఉండి మాట్లాడుకుంటున్న పిక్చర్స్ వీడియోస్ నెట్టింత బాగా ట్రెండ్ చేస్తున్నారు మెగా నందమూరి ఫ్యాన్స్..!!