బాహుబలి.. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా .. రానా దగ్గుబాటి విలన్ పాత్రలో పోషించిన సినిమా . రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయింది అనేదాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు .. ఈ సినిమాలో ఒక సీన్ మాత్రమే మరొక ఎత్తు. ప్రభాస్ బాహుబలి సినిమాలో ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు అక్కడి జనాలు ఓ రేంజ్ లో అరుస్తారు. అప్పుడు రానా దగ్గుబాటి పెట్టుకున్న కిరీటం సైతం కింద పడిపోతుంది .
అదే సీన్ గుర్తు చేశారు నేడు పవన్ ఫ్యాన్స్ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనకున్న స్టార్ డమ్ గురించి అందరికీ తెలిసిందే . నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు . ఆ సభా ప్రాంగణంలో వచ్చిన రెస్పాన్స్ చూసి అక్కడికి వచ్చిన వేరే రాష్ట్ర ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ కొనిదెలా అను నేను అంటూ పవన్ కళ్యాణ్ నోటి నుండి మాట రాగానే సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది .
ఎంతలా అంటే ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా అంత జోష్ రాలేదు. పవన్ కళ్యాణ్ కొణిదెల అనే నేను అంటూ పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా.. కార్యకర్తలు అభిమానులు మెగా కుటుంబ సభ్యులు అరిచిన అరుపులకు.. వేసిన విజిల్స్ కు బాహుబలి సినిమాలోని సీన్ అందరికీ గుర్తొచ్చింది . ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు పవర్ స్టార్ గా సినిమా ఇండస్ట్రీని ఏలేసిన పవన్ కళ్యాణ్ ఇక ఒక మినిస్టర్ గా ఎలా రాష్ట్రాన్ని పాలిస్తాడు..? ప్రజాసేవ చేస్తాడు..? అనేది చూడాలి అంటూ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు..!!
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను…#PawanKalyanAneNenu pic.twitter.com/jLKpg0z2mQ
— Trend PSPK (@TrendPSPK) June 12, 2024