ఇండియన్ సినీ చరిత్రలోనే కల్కి సినిమా చాలా ప్రత్యేకంగా ఉండ నుంది అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవే వార్తలు నిజమయ్యేటట్లు కనిపిస్తున్నాయి. కల్కి సినిమా చూసిన అభిమానులు కాలర్ ఎగరేసుకొని.. గర్వపడేలా సినిమా ఉంటుందని తాజాగా నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకోవడంతో ఎమోషనల్ గా మాట్లాడుతూ నాగ్ అశ్విన్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
మైదాలజీ, సైన్స్ ను మిక్స్ చేసి నేను సినిమాను తెరకెక్కించా. ఎన్నో సంవత్సరాల నుంచి భావిస్తున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కల్కితో నెరవేరింది అంటూ నాగ్ అశ్విన్ వివరించాడు. అటు సైన్స్ తో పాటు.. ఇటు మైథాలజికల్ పై కూడా నాకు ఆసక్తి ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. మైథాలజీకి సమానంగా సైన్స్ యాడ్ చేసి కల్కి తెరకెక్కించారని నాగ్ అశ్విన్ వివరించాడు. కాస్టింగ్, టీం డెడికేషన్‌తో అంతా కలిసి ఈ మూవీ తెరకెక్కించామని ఆయన చెప్పుకొచ్చాడు. నా డ్రీమ్ నేను నిజం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది అంటూ ఆయన వివరించాడు.
కల్కి సినిమా కొరకు టీం ఎంతగానో కష్టపడ్డారని.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉండనుంది అంటూ నాగ్ అశ్విన్ వెల్లడించాడు. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే వ్యూస్ పరంగా దూసుకుపోతుంది. అలాగే కల్కి అడ్వాన్స్ బుకింగ్‌లోను రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏ సినిమాకు లేని రేంజ్‌లో కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్ తో వన్ మిలియన్ కలెక్షన్లను రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఇక ప్రభాస్ మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఈ సినిమా ఏ రేంజ్‌లో పెంచుతుందో వేచి చూడాలి.