కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌తో దూసుకుపోయిన స్టార్ హీరోయిన్లలో సీనియర్ బ్యూటీ లయ కూడా ఒకటి. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న లయా.. టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. 1999లో రిలీజ్ అయిన స్వయంవరం సినిమాతో సినీ ఆడియన్స్ కు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో మెరిసింది. అంతేకాదు.. మూడు నంది అవార్డులను సైతం దక్కించుకుని నటిగా రాణించింది.
కొన్ని సంవత్సరాల క్రితం ఈమె వివాహం చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. పెళ్లి తర్వాత చాలా లాంగ్ గ్యాప్‌తో ఇటీవల మళ్ళీ సినిమాల్లో రియంట్రీకి సిద్ధమైంది లయ. ఇటీవల నితిన్ హీరోగా.. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందిన తమ్ముడు సినిమాల్లో లయ.. నితిన్ అక్క పాత్రలో మెరిసింది. దిల్ రాజు ప్రొడ్యూసర్గ వ్యవహరించిన ఈ సినిమా ధియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నేను రెండో తరగతి చదువుకున్న రోజుల్లో చెస్ కాంపిటీషన్లో పాల్గొనేదాన్ని.. చెస్ లో ఏడుసార్లు రాష్ట్ర అవార్డులు కూడా దక్కాయి. ఒకసారి నేషనల్ అవార్డు కూడా అందుకున్నా. అలా.. రెండో తరగతి నుంచి పదవ తరగతి వరకు చెస్ పై పూర్తి కాన్సన్ట్రేషన్ చేసిన నేను.. తర్వాత అది కుదరకపోవడంతో చెస్ కోచింగ్ అంటే గంటలు తరబడి దానిపై కాన్సెంట్రేషన్ చేయాల్సి రావడంతో.. టెన్త్, ఇంటర్ చదువులని పూర్తి చేయడానికి చేస్‌ను పక్కన పెట్టేసా. దాంతో నా చెస్ ప్లేయింగ్ జర్నీ అక్కడతో ఆగిపోయింది. తర్వాత హీరోయిన్గా బిజీ అవ్వడంతో చెస్ వైపుకు వెళ్లలేదంటూ చెప్పుకోవచ్చింది.