టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది సినిమా బిజినెస్ ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఏప్రిల్ 30న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ కావడం, టీజర్ సంచలనం రేపడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ట్రైలర్ రాకముందే ప్యాన్ ఇండియా స్థాయిలో వచ్చిన బజ్ చూసి బయ్యర్లు భారీ ఆఫర్లతో నిర్మాతల దగ్గరకు పరుగులు పెడుతున్నారు.

2026లో అతి పెద్ద ఓపెనర్‌గా పెద్ది నిలవబోతోందన్న అంచనాలు ఇండియన్ ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి. ‘పెద్ది’ థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.300 కోట్ల మార్కును తాకే అవకాశం ఉందంటున్నారు. ఒక్క నైజాంలోనే రు. 65 కోట్ల రేషియో చెపుతున్నారు. మైత్రీతో పాటు దిల్ రాజు, ఏషియన్ సునీల్ ఈ సినిమా రైట్స్ కోసం గట్టిగా పోటీపడుతున్నా.. మైత్రీకే రైట్స్ దక్కే ఛాన్స్ ఉంది. కర్ణాటక హక్కులు 23 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 40 కోట్లు చొప్పున అగ్రిమెంట్లు పూర్తయినట్లు టాక్ ?

సీడెడ్ ప్రాంతంలో 35 కోట్లు, కోస్టల్ ఆంధ్రలో సుమారు 85 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని సమాచారం. ఏపీ, తెలంగాణతో పాటు ఓవరాల్‌గా ఇండియా, అటు ఓవర్సీస్‌లోనూ పెద్ది బిజినెస్ అయితే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

