వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వచ్చే యేడాది పాదయాత్రకు రెడీ అవుతున్నారు. గత 2017లో పాదయాత్రతోనే భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 11 సీట్లతో పూర్తిగా డీలాపడిపోయారు. మరోసారి 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో తెలుసుకుని అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే యేడాది వైఎస్సార్ జయంతి సందర్భంగా ఫ్లీనరీ ఏర్పాటు చేసుకుని తర్వాత పాదయాత్రకు ముహూర్తం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలన్న ప్లానింగ్ ఉంది. అయితే ఈ సారి జగన్ పాదయాత్ర అంత ఈజీ కాదని.. పరిస్థితులు 2017లో వేరు.. 2027లో వేరుగా ఉన్నాయి.. ఈ మరి సవాళ్లు ఏమిటి ? జగన్ వీటిని ఎలా ఎదుర్కొంటారో ? చూడాలి.

