తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రెండు వారాల ముందే ‘ దేవర ‘..?!

ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం భారీ పాన్ ఇండియన్ మూవీగా దేవర తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందు నుంచే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఆర్‌ఆర్ఆర్ సినిమా తరువాత నటిస్తున్న ఎన్టీఆర్ మొదటి సోలో సినిమా కావడం.. అలాగే దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి సినిమాలో హీరోయిన్గా నటిస్తుండడం.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పింది. ఇక గతంలో కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావ‌డంతో వీరిద్దరి కాంబోపై కూడా ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు, విస్మరణకు గురైన ఓ స‌ముద్రతీర ప్రాంతం నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అనుకున్న టైం కంటే దేవర ముందుగానే వచ్చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే అక్టోబర్ 10 కంటే రెండు వారాల ముందుగానే దేవరను ప్రేక్షకుల ముందుకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

సెప్టెంబర్ 27 సినిమాని రీలీజ్‌ చేయబోతున్నారంటూ తెలుస్తోంది. అదే తేదీకి పవన్ కళ్యాణ్ సినిమా రావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యంతో సినిమా రిలీజ్ వాయిదా పడిందని.. ఇప్పుడు అదే తేదీ దేవర లాక్ చేసిందంటూ టాక్ నడుస్తోంది. అయితే ఇది కేవలం ఊహాగానం మాత్రమే. మూవీ యూనిట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే కానీ దీనిపై క్లారిటీ రాదు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా సుధాకర్, హరికృష్ణ కే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నాడు.