బాబు ప్రమాణస్వీకారానికి రాని తారక్, బన్నీ.. కారణం అదేనా..?!

ఏపీ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు తారక్‌, బన్నీలకు ఆహ్వానం అందిందని సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వైరల్ అయిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వాస్తవానికి తారక్, బన్నీలకు అసలు ఆహ్వానమే అందలేదని తెలుస్తుంది. ఒకవేళ ఆహ్వానం అంది ఉంటే మాత్రం తారక్, బన్నీ ఇద్దరు ఈ వేడుకకు ఖచ్చితంగా హాజరై ఉండేవారని టాక్ న‌డుస్తుంది. ఇక తారక్ గత కొన్ని ఏళ్లుగా టీడీపీకి అనుకూలంగా ఎప్పుడు వ్యవహరించలేదన్న సంగతి తెలిసిందే.

N Chandrababu Naidu Sworn in as Andhra Pradesh Chief Minister

ఎన్టీఆర్ పార్టీల‌కు అతీతంగా సినిమాలపై మాత్రమే ఫోకస్ పెడుతూ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. అల్లు అర్జున్ విషయానికి వస్తే వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా దూసుకుపోతున్నాడు. ఈ హీరోకు రోజురోజుకు ఫ్యాన్ బేస్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదనటంలో అతిశయోక్తి లేదు. అయితే రాబోయే రోజుల్లో బన్నీ, తారక్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను కలసి విష్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇద్దరు హీరోల సినిమాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు అంటే కూటమి సపోర్ట్ కచ్చితంగా వీరికి ఉండాలి.

Ala Vaikunthapurramloo: Jr NTR Is In Awe Of Allu Arjun's Sankranti Release

పుష్ప 2, దేవర సినిమాలు.. రెండు నెలలు గ్యాప్ లో ఒక సినిమా త‌ర్వాత మ‌రోక‌టిప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇక తారక్, బన్నీ సినిమాలకు టికెట్ రేట్లు పెరగాలంటే కూటమినేతల అనుమతి తప్పకుండా ఉండాలి. ఒకవేళ తమ సినిమాలకు ఇబ్బందులు ఎదురైతే ఏ హీరోలు ఏ విధంగా వ్యవహరిస్తారు అన్న చర్చ కూడా నెటింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇక వీరిద్దరూ పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోనూ ఒక్కో మెట్టు ఎదుగుతూ సక్సెస్ సాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు బన్నీ, తారక్‌ల‌ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది.