ఆ సినిమాను మ‌హేష్ ఏకంగా 100 సార్లు చూశాడా.. ఆ మూవీ అంత స్పెషలా.. మ్యాట‌ర్ ఏంటంటే..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సుధీర్ బాబులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సుదీర్ మహేష్ కు స్వయానా బావ అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఇకపోతే సుధీర్ తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ఆడపా దాడపా సినిమాల్లో నటిస్తున్న సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర. జ్ఞాన సాగర్ డైరెక్షన్లో రూపొందించిన ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు విశ్వక్ అడవిశేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగా సుధీర్ బాబు యంగ్ హీరో అడవి శేషు గురించి మాట్లాడుతూ నాకు ఇండస్ట్రీలో ఆయన స్ఫూర్తి అంటూ తన తలరాతన తానే రాసుకున్నాడు అంటూ వివరించాడు.

Mahesh Babu Phone Call📞Conversation With Sudheer Babu at HAROMHARA Movie  Pre Release Event

సినిమా కథల విషయంలో చాలామంది ఇతరుల అభిప్రాయాలను తీసుకుని మార్పులు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ రోజుల్లో ఒక హీరోకు మరో హీరో సపోర్ట్ చేయడం అనేది నిజంగా గ్రేట్. ఏ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా విశ్వక్‌సేన్ హాజరై సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అది తనలో ఉన్న గొప్ప లక్షణం అంటూ వారిద్దరి గురించి వివరించాడు. హారోం హారలో నేను సుబ్రహ్మణ్యం పాత్రలో నటించా.. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంటుంది అంటూ ఆయన వివరించాడు. ఇక ఈ సినిమా కోసం చాలామంది కష్టపడడారంటూ చెప్పుకోవచ్చిన సుధీర్ బాబు.. ఇదే ఈవెంట్లో మహేష్ బాబు తో మాట్లాడిన ఫోన్ రికార్డును ప్లే చేశాడు.

Krishna Vijaya Nirmala Mosagallaku Mosagadu completes 50 Years First Telugu  Movie Dubbed Into Hollywood | 50 Years Of Mosagallaku Mosagadu:50 ఏళ్ల  క్రితమే పాన్ ఇండియా మూవీతో సంచలనం సృష్టించిన సూపర్ ...

అందులో సుధీర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు మహేష్ ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చాడు. సినిమాల్లో మొదటిసారిగా గ‌న్ ఉపయోగించినప్పుడు ఎలా అనిపించింది అని సుధీర్.. మహేష్ ని అడగగా.. ఆయన వివరిస్తూ గన్స్ ఉపయోగించడం పై నేను ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. టక్కరి దొంగ మూవీలో ఎక్కువగా గన్స్ ఉపయోగించా. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే గన్స్‌ని చూపించిన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది అని అడగగా నాన్నగారు నటించిన మోసగాళ్లకు మోసగాడు.. సినిమా ఇప్పటికీ 100 సార్లు చూసి ఉంటా. నాకు ఆ సినిమా చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు మహేష్. ప్రస్తుతం మహేష్, సుధీర్ మ‌ధ్య జ‌రిగిన ఈ కాన్వర్జేషన్ నెట్టింట వైరల్ అవ్వడంతో మహేష్ కు తండ్రి నటించిన ఆ సినిమా అంటే ఎందుకంత ఇష్టం.. ఏకంగా వందసార్లు చూశాడా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.