బ్రేకింగ్.. నటుడు పృథ్వీరాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చిన కోర్ట్.. కారణం ఇదే..?!

30 ఇయర్స్ ఇండస్ట్రీ మార్క్ నటుడు పృథ్విరాజ్‌కు.. విజయవాడ ఫ్యామిలీ కోర్ట్‌ భారీ షాక్ ఇచ్చింది. ఆయనకు తాజాగా నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల భరణం చెల్లించాలని,, పృధ్విరాజ్ కు కోర్టు గతంలో ఆదేశించింది. అయితే కోర్ట్‌ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోగా.. కోర్టుకు హాజరు కూడా కాలేదు. ఈ కారణంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను కోర్టు ఇచ్చినట్లు సమాచారం. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ కు 1984లో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు.

అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలతో పృథ్వీరాజ్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. దీంతో శ్రీలక్ష్మి పిల్లలతో కలిసి తన పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. ఈ క్ర‌మంలో 2017 లో శ్రీలక్ష్మీ కోర్టును ఆశ్రయించి.. భర్త నుంచి తనకు ఎనిమిది లక్షల భరణం ఇప్పించవలసిందిగా కోరింది. పృధ్విరాజ్.. విజయవాడలోని శ్రీలక్ష్మి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాలకు నటించేందుకు ప్రయత్నించాడని.. ఆ ఖర్చులన్నీ తన తల్లిదండ్రులే భరించారంటూ కోర్టుకు వివరించింది. సినిమాల్లోకి వెళ్ళాక ఆయన తరచూ తనను ఇబ్బంది పెట్టేవాడని.. 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి బయటకు పంపించేసాడని.. దాంతో మళ్ళీ పుట్టింటికి వచ్చాను అంటూ ఆమె ఫిర్యాదులో వివరించింది.

Comedian Prithviraj shocked by the court నటుడు పృథ్వీకి షాక్ ఇచ్చిన కోర్టు

అలాగే తన భర్త సినిమాలు, టీవీ సీరియళ‌ ద్వారా నెలకు 30 లక్షల సంపాదిస్తున్నాడని.. అతని నుంచి భరణం ఇప్పించవలసిందిగా 2017 జనవరి 10న న్యాయస్థానంలో కేసు దాఖలా చేసింది. శ్రీలక్ష్మి కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్ట్.. పృథ్వీరాజ్ తన భార్యకు ఎనిమిది లక్షల భరణం అంతేగాక ఆమె కేసు దాఖలాలు చేసినప్పటి నుంచి అయినా ఖర్చులు అన్నీ తానే భరించాలని తీర్పునిచ్చారు. ప్రతినెల 10వ తేదీ నాటికి ఆమెకు భ‌రణం చెల్లించాలని కోర్టు ఆదేశించినా.. పృథ్వీరాజ్ అందులో విఫలమైనట్లు సమాచారం. అంతేకాదు ఆయన కోర్టుకు కూడా హాజరు కాకపోవడంతో ఆయనకు విజయవాడ హైకోర్టు నాన్ బెయిల‌బుల్‌ అరెస్ట్ వారెంట్‌తో వారి షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.