నా మూవీ ఈవెంట్లకు మహేష్ రాకపోవడానికి కారణం అదే.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్..?!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు బావగా సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గా ఇండస్ట్రీలో స్థానాన్ని సంపాదించుకున్నాడు సుధీర్ బాబు. నటుడిగా ప‌లు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సుధీర్‌ హీరోగా ఇప్పటికే పలు సినిమాలో నటించినా అనుకున్న రేంజ్‌లో సక్సెస్ అందలేదు. అయితే ఎప్పటికప్పుడు వివిధమైన పాత్రలో సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఆయనకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇలాంటి క్రమంలో సుధీర్ బాబు త్వరలోనే మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం సుధీర్ బాబు హరోం హ‌ర‌ సినిమాతో జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Mahesh Babu Congrats Sudheer Babu! | cinejosh.com

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు.. మహేష్ బాబు కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. మహేష్ తన బావకు సపోర్ట్ చేస్తూ సుదీర్ బాబుని కూడా స్టార్ హీరోగా నిలబెట్టొచ్చు కదా.. కానీ సుధీర్ బాబు మూవీ ఈవెంట్లకు కూడా ఎప్పుడు మహేష్ బాబు ఎందుకు రారు అనే ప్రశ్నలు సుధీర్ బాబుకు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తు న‌టుడిగా నేను నా సినీ ప్రయాణం మొదలుపెట్టా.

Hero Sudheer Babu Speech At HaromHara Trailer Launch Event | Sudheer Babu |  V6Ent - YouTube

మొదట్లో మహేష్ నా మూవీ ఈవెంట్లకు వచ్చాడు. అయితే నేను ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా మహేష్ పేరును వాడుకుంటూ ఎదగాలని అనుకోవడం లేదు. ఇక ఒక కోస్టార్‌గా, బంధువుగా మహేష్ చేసే సూచనలు సింపుల్ గానే ఉంటాయి అంటూ సుధీర్ బాబు వివరించాడు. ఇక ఇటీవల సుధీర్ బాబు నటించిన ఈ మూవీకి సుమంత్ జి నాయుడు ప్రొడ్యూసర్ గా, జ్ఞానసాగర్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ సినిమాలో మాళవిక శర్మ సుధీర్‌కు జంట‌గా నటించింది. ఈ క్రమంలో త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమా ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.