ఇండస్ట్రీకి రావాలని కలలేమీ కనలేదు.. మృణాల్ కామెంట్స్ వైరల్..?!

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాధించుకుంది మృణాల్ ఠాగుర్‌. కాగా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న‌ మృణాల్‌ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి. నటన అనేది నా చిన్ననాటి కాలేమీ కాదు.. డెస్టినీ నన్ను ఈ రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది అంటూ ఆమె వివరించింది. వరుస‌ అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఇంటర్వ్యూలో తన అభిమానులతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. బాల్యమంతా వివిధ సిటీలలో తిరగడానికే సరిపోయిందని వివ‌రించింది.

అలా సిటీలు మారుతూ ఉండడం వల్ల కొత్త వాతావరణ అనుకూలంగా నడుచుకోవడం అలవాటైందని.. నేను దాదాపు పది నుంచి 11 పాఠశాలలు మారి ఉంటా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. స్కూల్ మారినప్పుడు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అంటూ ఆమె వివరించింది. అలాగే నేను యాక్టర్ గా ఎదగాలన్నది కూడా నా డ్రీమ్ కాదు.. కానీ డెస్టినేషన్ వల్ల ఈ వైపు వచ్చా. అదే నన్ను డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా చేయడానికి కారణమైంది.

అక్కడే నటన పట్ల నాకున్న అభిరుచిని అర్థం చేసుకున్నా. ఆడిషన్స్ నటనపై మరింత ఇంటరెస్ట్ ను పెంచేశాయి. నేనే ఈ రంగంలోకి రావాలని నా స్నేహితులు కూడా ఎప్పుడు ప్రోత్సహించేవాళ్లు అంటూ ఆమె వివరించింది. లవ్ సోనియా సినిమాలో నేను పోషించిన పాత్ర, నా నటన నైపుణ్యం ప్రదర్శించడానికి కాదు.. ప్రతి సినిమాలో చేసే పాత్రతో మర్చిపోలేని ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఎంతో తోడ్పడింది అంటూ మృణాల్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్‌ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవుతున్నాయి.