సినిమా నచ్చకపోతే కాల్ చేసి తిట్టండి.. నా నెంబర్ ఇదే.. అజయ్ ఘోష్ కామెంట్స్ వైరల్..?!

టాలీవుడ్ నటుడు అజయ్ గోష్, హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. జూన్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. శివ పాలడుగు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, పాట, పోస్టర్ లు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఈ ట్రైలర్‌కు మంచి టాక్ వినిపించింది.

మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. చిన్న సినిమాగా ప్రేక్షకులు ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని.. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. సినిమా అందరూ చూడండి.. నచ్చకపోతే నన్ను ఫోన్ చేసి మరీ బూతులు తిట్టొచ్చు అంటూ మాట్లాడుతూనే తన నెంబర్ కూడా చెప్పేసాడు. దీంతో మ్యూజిక్ షాపు మూర్తి సినిమాపై అజయ్ గోష్ ఎలాంటి అంచనాలు పెట్టుకున్నాడు అర్థం చేసుకోవచ్చు.

Music Shop Murthy coming soon. | Instagram

ఇక ఈ సినిమాల ప్రధానపాత్రలో అజయ్ గోష్‌ నటించడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్‌లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అజయ్ గోష్.. పాతికేళ్ళ వయసులో సాధించలేని సక్సెస్ 50 ఏళ్ళు తర్వాత సాధించాలని భావించే ఓ వ్య‌క్తిగా క‌నిపించాడు. దానికోసం ఆయన చేసే సాధన ప్రయత్నం ఎలా ఉంటుంది.. ఎంత ఎమోషనల్ గా సాగింది. ఆడియన్స్‌కు చెప్పే కాదే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అంటూ డైరెక్టర్ శివ పాలడుగు వివరించాడు. కాగా అజయ్ ఘోష్ తన మొబైల్ నెంబర్ ఇచ్చేసి మరీ ఓపెన్ ఛాలెంజ్ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది.