బాలయ్య vs రవితేజ.. ఈసారైనా మాస్ మహారాజ్.. నటసింహం పై విన్ అవుతాడు..?!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలయ్యకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంద‌న‌టంలో సందేహం లేదు. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల పరంగాను వరుస హ్యాట్రిక్‌లతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో తన 109వ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల మంచి అంచనాలు నెలకొన్నాయి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుంది అంటూ నందమూరి అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

NBK 109 Glimpse: Balayya In Savage Action Mode

ఇలాంటి నేపథ్యంలో బాలయ్య కు పోటీగా టాలీవుడ్ మాస్‌ మహారాజు రవితేజ బరిలోకి దిగుతున్నాడంటూ ఓ క్రేజీవార్త నెటింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. కాగా ఇప్పుడు ఇద్దరు హీరోల సినిమాలకు క్లాష్ రానుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో బాలయ్య, రవితేజ చాలా సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడిన సంగతి తెలిసిందే.

Ravi Teja on X: "#MrBachchan Naam tho suna hoga 😉 Honoured to play the  character with the name of my favourite @SrBachchan saab 🤗🙏 @harish2you  @peoplemediafcy @TSeries https://t.co/CHMOvgh3bo" / X

గత ఏడాది కూడా బాలయ్య భగవంత్‌ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో తలపడగా టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. బాలయ్య భ‌గ‌వంత్ కేస‌రి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ ఏడాదిలో సెప్టెంబర్ 27న మరోసారి ఇద్దరూ త‌లపడనున్నట్లు స‌మాచారం. దీంతో ఈసారైనా బాలయ్య పై రవితేజ పై చేయి సాధిస్తాడో లేదో అనే సందేహాలు అభిమానులో మొద‌ల‌య్యాయి.