కొలివుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి పాపులారిటి ఉంది. ఈ క్రమంలోనే విజయ్‌ను ఉద్దేశించి.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన కామెంట్స్ నెటింట దుమారంగా మారాయి. తమిళ్ స్టార్ హీరో విజయ్‌ని చూసి.. మన తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలని.. ఇక్కడ హీరోలు విజయ్‌ను ఫాలో అయితే నిర్మతలకు చాలా ఖర్చు తగ్గిపోతుందని దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఫోడ్ కాస్ట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. పక్కాగా కొన్ని డేట్స్ ఇస్తాడు. అందులోనే సినిమా కంప్లీట్ చేస్తాడు. షూటింగ్ ఎప్పుడు మొదలు పెడుతున్నారు.. ఎప్పటికీ పూర్తి చేస్తారని ముందే వివరాలు తెలుసుకుంటాడు.. దానికి తగ్గట్టుగానే ఆయన ఫాలో అవుతాడు అంటూ వివరించాడు.
అలా నెలల 20 రోజులు షూటింగ్ కు కేటాయించేవాడని.. ఆరు నెలల పాటు డేట్స్ ఇచ్చి వారసుడు సినిమాను కంప్లీట్ చేశాడని.. నాకు దానికి 120 రోజులు సమయం పట్టింది. అందులోనే సినిమా పూర్తి చేసాం. ఈ రూల్ ప్రతి హీరో పాటిస్తే నిర్మాతలకు అసలు ఇబ్బంది ఉండదు. అది ఒక విధంగా మాకు సువర్ణ అవకాశం. ప్రతి హీరో ఆరు నెలల్లో ఎన్ని రోజులు డేట్స్ ఇస్తారో ముందే ఫిక్సై.. అందులోనే మూవీ పూర్తి చేస్తే అందరికి స్ట్రెస్ తగ్గుతుంది. టైంకి సినిమా అయిపోతుంది. నిర్మాతలు, టెక్నీషియన్లు, దర్శకులు ఇలా అందరూ ఎక్కువగా కష్టపడతారు. ఇక ప్రీ ప్రొడక్షన్ కు సైతం కాస్త సమయం తీసుకుని సినిమాలు కంప్లీట్ చేస్తారు.
కానీ.. ఈ విధానం మన దగ్గర కనిపించడం లేదు. ఆ సిస్టం మళ్ళీ రావాలని భావిస్తున్నా. నాతో కలిసి వర్క్ చేయబోయే హీరోలను కూర్చోబెట్టి డేట్స్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోమంటున్నా. ప్రతినెల 20 రోజులు నాకు డేట్సె ఇచ్చేయమని చెప్తా. విజయ్, నితిన్ లకు కూడా అదే చెప్పా. లేదంటే ఏడాదిలో తీయాల్సిన సినిమా రెండేళ్లు పూర్తయిన కావట్లేదు. ఖర్చులు రెట్టింపు అవుతున్నాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు, ప్రొడక్షన్ వాళ్ల జీతాలు ఇలా.. అన్నింటితో బడ్జెట్ భారీ అవుతుంది. ఈ పద్ధతి మారాలంటే.. అది మన హీరోల చేతులలో ఉంది. వారు సరైన నిర్ణయాలు తీసుకోవాలంటూ దిల్ రాజు కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. దీనిపై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.