పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు మరీ ఓవర్ చేస్తున్నాడా..? ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!

ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విషయంలో ప్రవర్తిస్తున్న తీరు జనాలకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది . అంతేకాదు పవన్ ఫ్యాన్స్ కి కూడా ఎక్కడో తేడా కొడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్ . అఫ్కోర్స్ ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అధికారం చేపట్టడానికి కర్త – కర్మ – క్రియ అంతా పవన్ కళ్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే .

అయితే సీఎంగా మాత్రం నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు . ప్రమాణస్వీకారం చేసే ముందు మీటింగ్లో కూడా అందరితో పాటు సమానంగా నాకు కుర్చీ వేయండి అంటూ తనకు వేసిన స్పెషల్ కుర్చీని సైతం తీయించేసాడు చంద్రబాబు. అంతేనా ప్రమాణస్వీకారం రోజు పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ప్రిఫరెన్స్ అంతా ఇంతా కాదు . అసలు సీఎం పవన్ కళ్యాణ్ నా..? చంద్రబాబు నా..? అనే రేంజ్ లో డౌట్లు వచ్చాయి .

నరేంద్ర మోడీ సైతం అదే విధంగా బిహేవ్ చేశారు . ఇక ఆ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడిగిన శాఖలకు మించి ఎక్కువగా ఇవ్వడం.. అంతేకాకుండా ఆయనకు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టడం.. మాటకు ముందు ఒకసారి మాటకు వెనక ఒకసారి పవన్ కళ్యాణ్ కు ప్రిఫరెన్స్ ఇవ్వడం.. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడం ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ చంద్రబాబు నాయుడు ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో ఉండేలా నిర్ణయం తీసుకోవడం జనాలకు కొత్త డౌట్లు క్రియేట్ చేస్తుంది. అతివినియం చూపిస్తున్నారా..? లేకపోతే ముంచేయడానికి ట్రై చేస్తున్నారా ..? అన్న విధంగా కూడా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు . ఏమో పవన్ కళ్యాణ్ తన జాగ్రత్తల్లో తను ఉంటే మంచిది అంటున్నారు ఫ్యాన్స్..!?