“నాకు బాలీవుడ్ వాళ్లు అవకాశం ఇస్తున్నారు అంటే కారణం అదే”.. తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

తాప్సి ..ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ . ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . తాప్సి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తాప్సితనదైనా స్టైల్ లో నటించి ఎన్నో ఎన్నో హ్యూజ్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది . ఆఫ్ కోర్స్ ఫ్లాప్ సినిమాలను కూడా తన ఖాతాలో వేసుకుంది . బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత తాప్సి ఏ రేంజ్ లో అల్లాడించేసిందో మనకు తెలిసిందే .

బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లోను సినిమాలను చూస్ చేసుకుంది . మరీ ముఖ్యంగా హీరోయిన్ తాప్సి పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే రీసెంట్గా ఈవెంట్లో ఓ పాల్గొన్న తాప్సి .. తనకు బాలీవుడ్ లో అవకాశాలు రావడం పట్ల కామెంట్స్ చేసింది . ఆమె మాట్లాడుతూ..” చాలా మంది అంటూ ఉంటారు నన్ను ప్రీతిజింతాకు నెక్స్ట్ వెర్షన్ అని.. అప్ గ్రేటెడ్ వర్షన్ అని “..

“ఎందుకంటారో అలా నాకు తెలియదు కానీ, చాలామందికి ఒక డౌట్ ఉంది. ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయి..? అని ..కేవలం పాజిటివిటీ ..యస్ పాజిటివిటీతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అదే నాకు ప్లస్ పాయింట్.. నేను ఎప్పుడూ నా మైండ్ ని పాజిటివ్ గా పెట్టుకుంటాను .. నాకు బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి అంటే కారణం మాత్రం పాజిటివిటీ అని నేను నమ్ముతున్నాను “అంటూ కామెంట్స్ చేసింది.