ఎంత కష్టపడుతున్నా.. సంపాదిస్తున్నా.. చేతుల్లో ఒక్క రూపాయి కూడా నిలవడం లేదా..? అయితే ఇలా చేయండి ..మీ ఇంట డబ్బే డబ్బు..!!

చాలామంది బాగా కష్టపడుతూ ఉంటారు ..ఒకరి రూపాయి నాకు అనవసరం .. నేను కష్టపడిన రూపాయి నా సొంతం అంటూ రాత్రి పగలు తేడా లేకుండా బాగా బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బులు అలా వచ్చినట్టే వచ్చి ఇలా నీళ్లులా ఖర్చయిపోతూ ఉంటుంది . కారణాలు ఏవైనా కావచ్చు కొందరు చేతుల్లో డబ్బు నిలవడం అనేది అస్సలు జరగదు. మరికొందరు మాత్రం అసలు డబ్బు సంపాదించకపోయినా సరే చేతుల్లో మాత్రం ఎప్పుడు కట్టలు కట్టలు డబ్బులను పట్టుకొని ఉంటారు .

అయితే చేతిలో డబ్బులు ఖర్చవ్వకుండా నాలుగు రూపాయలు వెనకేసుకోవాలి అన్న దాచుకోవాలి అన్న ఈ ఒక్క పని చేస్తే చాలు అంటూ పెద్దలు చెప్తున్నారు. ఇంట్లో పూజ గదిలో చిన్న వినాయకుడి బొమ్మను శుక్రవారం పూట పాలతో అభిషేకం చేసి.. గంధం కుంకుమతో అలంకరించి.. రకరకాల పూలతో అలంకరించి.. ఆయన బొడ్డుకు ఒక పసుపు గుడ్డలో ఒక రూపాయి బిళ్ల లేదా ఐదు రూపాయల బిళ్ళను ఆ గుడ్డకు కట్టి ..

ఆ గుడ్డను వినాయకుడి బొడ్డుకు ముడివేస్తే కచ్చితంగా ఇంట్లో చికాకులు పోతాయి అని .. ఎక్కువగా డబ్బు ఖర్చవ్వకుండా ..డబ్బును నిలువ చేస్తాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు . చాలామంది దీనిని ఫాలో అవుతూ ఉండటం కూడా గమనార్హం. మరెందుకు ఆలస్యం మీరు ఎంత కష్టపడినా మీ చేతుల్లో డబ్బులు నిలవలేక పోతూ ఉంటే ఒకసారి ఈ పని చేసి చూడండి ఆ తర్వాత రిజల్ట్ మీకే అర్థమవుతుంది..!