బిగ్ బాస్ లోకి ఆమెని పంపడానికి..స్టార్ మా అంత సాహసం చేస్తుందా..?

బిగ్ బాస్ తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో.. ఇప్పటికే ఏడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. యధావిధిగా ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ ను పోస్ట్ చేయబోతున్నాడు నాగార్జున అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సీజన్ వన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు ..సీజన్ 2 నాని హౌస్ట్ చేశారు .. ఆ తర్వాత నుంచి మొత్తం అన్ని సీజన్స్ నాగార్జుననే హోస్ట్ చేస్తూ వచ్చారు . ఆయనను చూసి చూసి బోర్ కొట్టేస్తుంది జనాలకి. యాంకరింగ్ విషయంలో నాగార్జున తోపే అయిన అన్ని సీజన్స్ కి ఒక్కే ముఖం చూడాలి అంటే ఎవరికైనా బోరే..

కానీ ఎందుకో బిగ్ బాస్ మేనేజ్మెంట్ నాగార్జున ని హోస్టుగా తొలగించడం లేదు . నాగార్జున నేను చెయ్యను రా బాబోయ్ అన్న కూడా లేదు లేదు మీరే చేయాలి అంటూ పట్టుబట్టి మరి నాగార్జున చేత హోస్టింగ్ చేపిస్తుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాగా బిగ్ బాస్ సీజన్ 8 లో ఈసారి చాలా చాలా తోపైన కంటెస్టెంట్స్ ని చూస్ చేసుకుందట బిగ్ బాస్ మేనేజ్మెంట్ . అయితే స్టార్ మా మాత్రం ఒక స్పెషల్ పర్సన్ నీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుందట . ఆమె మరి ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు.

ఎస్ దీపికా రంగరాజు ఎన్ని షోస్ లో పాల్గొని తనదైన స్టైల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో తెలిసిందే. అసలు బ్రహ్మముడి సీరియల్ అంత పెద్ద హిట్ అవుతుంది అంటే కారణం మాత్రం కచ్చితంగా అది దీపిక రంగరాజు వల్లనే అని చెప్పాలి ..ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే కచ్చితంగా ఈమె ట్రోఫీ విన్ అవ్వక తప్పదు ..అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే దీపికా రంగరాజుని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడానికి బిగ్ బాస్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట . అంతే కాదు స్టార్ మా కూడా ఆమెను పర్సనల్గా ట్రీట్ చేస్తూ హ్యూజ్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరి హౌస్ లోకి పంపించాలి అంటూ ప్రయత్నాలు చేస్తుండట . కానీ దీపికా మాత్రం అందుకు నో అంటూ ఆన్సర్ ఇస్తుందట. అయితే ఏదో ఒక విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఆమె ను పంపించేలానే ఉంది స్టార్ మా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!