ప్చ్: మళ్లీ దెబ్బేసిన రాజమౌళి.. మహేశ్ ఫ్యాన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్..!!

ఏంటో ..మహేష్ – రాజమౌళి సినిమా రోజురోజుకీ మరింత ఆలస్యం అయిపోతుంది. ఇదిగో ఈ రోజు పూజా కార్యక్రమాలు అదిగో రేపు అఫీషియల్ అప్డేట్ వస్తుంది అంటూ నానారచ్చరంబోలా ఫ్యాన్స్ చూస్తున్నా.. కానీ రాజమౌళి అస్సలు చలనం లేకుండా బిహేవ్ చేస్తున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. వీళ్ల కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలను ట్రెండ్ అవుతూ ఉంటాయి . కానీ సోషల్ మీడియాలో ఏ వార్త వైరల్ అయినా సరే రాజమౌళి దాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నారు .

త్వరలోనే ఈ సినిమా సెట్స్ పై కి వెళ్లబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా బాగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఫిలిమ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్న న్యూస్ ప్రకారం మరొక 6 నెలల పాటు రాజమౌళి – మహేష్ బాబుల సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్సే లేదట . మహేష్ బాబు లుక్స్ పట్ల ఏమాత్రం సాటిస్ఫై అవ్వని రాజమౌళి .. ఆయన కోసం స్పెషల్ డైటీషియన్ ని పెట్టి లుక్స్ విధంగా పూర్తిగా మార్చేసే దానికోసం చూస్తున్నారట .

ఈ క్రమంలోనే రాజమౌళి – మహేష్ బాబు సినిమా మరింత ఆలస్యం కాబోతుంది . రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్తే రెండు మూడు సంవత్సరాలు కచ్చితంగా పడుతుంది. అయితే రాజమౌళి తో సినిమా అంటే అసలు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సంవత్సరాలు టైం తీసుకుంటాడు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో..? ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందో ..? ఎప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరికొందరు రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు దబిడి దిబిడే అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!!