పెళ్లయిన ఆడవాళ్లు చేతికి అది వేసుకుంటే అంత ప్రమాదకరమా..? చరిత్ర చెబుతున్న నీతి..!

ప్రజెంట్ ట్రెండ్ మారిపోయింది .. పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కాలానికి అమ్మాయిలు మన సాంప్రదాయాలను మర్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు అమ్మాయిలు తమ భర్తలను పేరు పెట్టి పిలవాలి అంటేనే భయంతో వణికిపోయేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది . పెళ్లికి ముందే ప్రేమించుకునేయడం.. పెళ్లికి ముందే అన్ని విషయాల గురించి చర్చించుకోవడం .. పెళ్లి తర్వాత భర్తను ఏరా.. రారా.. పోరా అంటూనే కాకుండా పేరు పెట్టి కూడా పిలవడం .. మరికొందరు అసలు పేరు కన్నా ముద్దు పేరుతో పిలవడం ఎక్కువగా చూస్తున్నాము.

కాగా ఇలాంటి మూమెంట్లోనే మరొక వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. చాలామంది నేటి ట్రెండ్ ఫాలో అవుతూ ఆడవారు భర్తకట్టిన తాళిని కూడా తీసేస్తున్నారు . సింపుల్గా నల్లపూసలను మెడలో వేసుకుంటున్నారు. మరి కొంతమంది అది కూడా తీసేస్తున్నారు… ఫ్యాషన్ గా ఏదో ఒక సింపుల్ చైన్ మెడలో వేసుకొని తిరుగుతున్నారు . అయితే కొంతమంది ఆడవాళ్లు అసలు చేతికి మట్టి గాజులు వేసుకోవడమే మానేస్తున్నారు . మన సాంప్రదాయ ప్రకారం పెళ్లయిన ఆడవాళ్లు చేతినిండా గాజులు వేసుకొని ఉంటే భర్త ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.. శ్రేయస్సుకరం.

అయితే ఇప్పుడు ట్రెండ్ ఫాలో అయిపోతూ చేతికి బ్రెస్లైట్.. లాంటివి చిన్న తాడు లాంటివి కట్టుకుంటున్నారే తప్పిస్తే .. మట్టి గాజులు వేసుకున్న ఆడవాళ్ళను చూడాలి అంటేనే పెద్ద గగనంగా మారిపోయింది . ఎప్పుడో పెళ్లిళ్లప్పుడు ఫంక్షన్లో అప్పుడు గాజులు వేసుకొని అలా ఫోటోకి ఫోజులిచ్చి ఇలా తీసేస్తూ ఉంటారు. కానీ మన సాంప్రదాయం ప్రకారం పెళ్లయిన ఆడవాళ్లు చేతినిండా గాజులు .. నుదుట బొట్టు.. తలలో మల్లెపూలు .. మెడలో తాళి.. నల్లపూసలు కాళ్ళకి మెట్టెలు, గజ్జలు వేసుకొని ఉండడం చాలా చాలా భర్తకు కలిసి వస్తుంది అంటున్నారు పెద్దలు..!!