రాత్రి కలలో శివుడు కనిపిస్తే.. నిద్రలేచేసరికి ఉదయం ఖచ్చితంగా అలా జరుగుతుందా..?

చాలామందికి కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి . మరీ ముఖ్యంగా కొంతమందికి ప్రతిరోజు ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది . అయితే కొందరు మాత్రం మనకు వచ్చే కలలను మన స్టేట్ ఆఫ్ మైండ్ డిసైడ్ చేస్తుంది అంటూ చెప్పుకొస్తూ ఉంటారు. మరి కొందరు మాత్రం మనకు జరగబోయే విషయాలను దేవుడు మన కలల రూపంలో చెబుతూ ఉంటాడు అని చెప్పుకొస్తూ ఉంటారు . అయితే కొంతమంది ఎక్కువగా తమ కలలో వచ్చే వాటిని సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు .

మరి ముఖ్యంగా కలలో శివుడు కనిపిస్తే కచ్చితంగా ఉదయం ఇంట్లో నిద్రలేచేసరికి ఇలా జరుగుతుంది అని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు . చాలామంది రాత్రి వాళ్లు నిద్రపోయాక కలలో ఆ పరమశివుడు కనిపిస్తే ఉదయం ఇంట్లో ఏదో ఒక గుడ్ న్యూస్ వింటాము అని భావిస్తూ ఉంటారు. చాలామంది ఇలాంటి ఓ సిచువేషన్ ని ఫేస్ చేశాము అని కూడా చెప్పుకొస్తూ ఉంటారు . ఏదైనా మంచి జరిగేటప్పుడు మనకి కలలో శివుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ మంచి పనికి సంబంధించిన విషయాన్ని చెప్పేసి వెళ్తూ ఉంటారట .

మరి ముఖ్యంగా వాహనాలు కొనుక్కోవాలి అన్న ..ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలి అన్న ..ఇల్లు నిర్మించుకోవాలి అని బాగా ఆలోచిస్తున్న వాళ్లకు శివుడు తాను నేను ఉన్నాను మీరు ముందుకు వెళ్ళండి అంటూ కల రూపంలో భరోసా ఇస్తూ ఉంటారట . ఈ విషయాన్ని చాలామంది కూడా నమ్ముతూ ఉండడం విశేషం . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!