ఆమె అంటే చంద్రబాబుకి ఎందుకు అంత కోపం..? పబ్లిక్ లోనే ఏం చేశారో చూడండి(వీడియో)..!!

నారా చంద్రబాబు నాయుడు చూసేందుకు చాలా సైలెంట్ గా ఉంటారు కానీ ఆయన చేయాల్సిన పని మాత్రం చేసేస్తూ ఉంటారు . అందరిలాగా తొడ కొట్టడాలు ..మీసాలు మెలివేయడాలు చంద్రబాబుకు చేతకాదు అనుకున్న పని అనుకున్న టయానికి చేసి చూపిస్తాడు. అది ఇప్పటికే జనాలకి అర్థం అయిపోయింది . అసెంబ్లీలో తన భార్యను అగౌరవపరిచినందుకు ఆనాడు చేసిన శపధం రీసెంట్ గానే నిజం చేశాడు. మళ్లీ అధికారం చేపట్టాకే అసెంబ్లీలోకి అడుగు పెడతాను అని చెప్పిన చంద్రబాబు .. నారా చంద్రబాబు నాయుడు అను నేను అంటూ నాలుగవసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నాడు . ఏపీ ప్రభుత్వం మారిపోయింది కొత్త ప్రభుత్వం కొలువు తీరింది .. గత ప్రభుత్వం నేతలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.. గుణపాఠాలను కూడా నేర్చుకుంటున్నారు. అయితే ఐదేళ్లుగా వైసిపి నేతలు అడుగులకు మడుగులోత్తిన అధికారులు మాత్రం ఏం చేయాలో దిక్కుతోచక సతమత మవుతున్నారు.

కొత్త ప్రభుత్వం రావడంతో చంద్రబాబుకి జేజేలు పలుకుతున్నారు. ఇదే క్రమంలో సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు ఆ సమయంలో చాలామంది అధికారులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒక ఇన్సిడెంట్ మాత్రం అందరికీ షాకింగ్ గా అనిపించింది . అందరూ పూల బొకేలతో ఎదురెళ్లి చంద్రబాబు దృష్టిలో పడేందుకు ట్రై చేశారు. మరి ముఖ్యంగా జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులు చేసిన నానాహంగామ ఓవర్ గా అనిపించింది. బొకేలు పట్టుకొని చంద్రబాబు అంటే గౌరవం ఉన్న విధంగా హంగామా చేశారు. అయితే జగన్ అధికారంలో ఉన్నంతవరకు కొంతమంది ప్రభుత్వం అండ చూసుకొని ఎలా చంద్రబాబును అలాగే టిడిపి నేతలను ఇబ్బందులు పెట్టారో ఆ విషయాన్ని చంద్రబాబు ఎప్పటికీ మర్చిపోలేరు .

మరీ ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఈ పేరు మర్చిపోగలమా..? జగన్ అక్రమస్తుల కేసులో ఆమె కూడా ఒక ప్రధాన నిందితురాలు. గత ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు మంచి స్థానం ఇచ్చారు జగన్ . కాగా ఐఏఎస్ అధికారుల సమావేశంలో చంద్రబాబు హాజరవ్వగా ఏకంగా ఐఏఎస్ శ్రీ లక్ష్మి చంద్రబాబుకు స్ట్రైట్ గా వెళ్లి బోకె అందించారు ..కానీ చంద్రబాబు మాత్రం స్వీకరించలేదు.. సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు విశాంత్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ కూడా గుర్తున్నారుగా ..పెద్దిరెడ్డి ఇంట్లో పనిమనిషిగా చేసి చంద్రబాబు రాళ్లదాడితో అటాక్ చేశారు.. అంతేనా పేపర్ లీక్ అవ్వకుండానే అయింది అంటూ నారాయణ స్కూల్ సిబ్బందితో స్టేట్మెంట్ కూడా రాయించుకొని ..ఫోన్ ట్యాప్ చేసి మరి నారాయణను అక్రమంగా అరెస్ట్ చేశారు ..వాళ్లు పూల బొకేలు ఇస్తే చంద్రబాబు తీసుకోకుండా ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!