మళ్ళీ కొంప ముంచేసిన మహేశ్ బాబు..రాజమౌళికి బాగా కాలిపోయేలా చేస్తున్నాడే..!?

మహేష్ బాబు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ ఊహించిన చిక్కుల్లో మాత్రమే ఇరుక్కునేస్తున్నాడు. మరీ ముఖ్యంగా గుంటూరు కారం సినిమా టైంలో ఎంత హ్యూజ్ ట్రోలింగ్ కి గురయ్యాడో మనం చూసాం. రీసెంట్గా రాజమౌళితో సినిమాకి కమిట్ అయ్యాడు. ఆఫ్ కోర్స్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో మహేష్ బాబు మనం చూస్తున్నాం . కానీ రాజమౌళి కండిషన్స్ మాత్రం సాటిస్ఫై చేయలేకపోతున్నాడు . ఆయన పెట్టిన రూల్స్ ని బ్రేక్ చేస్తున్నాడు .

మనకు తెలిసిందే రాజమౌళితో సినిమా అంటే ఆషా మాషి వ్యవహారం కాదు . ఆయనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి . అవి కచ్చితంగా ఫాలో అవ్వాలి .. అయితే రాజమౌళి సినిమాలో నటించే హీరో తన లుక్స్ ని రివిల్ చేయకూడదు.. బయట ఎక్కడా తిరగకూడదు.. అది మహేష్ బాబుకి పెద్ద టఫెస్ట్ జాబ్ .. సంవత్సరానికి నాలుగు సార్లు అయినా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తూ ఉంటాడు ..అలాంటి మహేష్ బాబు లుక్స్ రివిల్ అవ్వకుండా ఎలా ఉంటాయి?

ఎంత ట్రై చేసినా రాజమౌళి ఆ లుక్స్ మాత్రం దాచిపెట్టలేకపోతున్నాడు . రీసెంట్గా మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళాడు. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . తాజాగా ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు దర్శనం ఇచ్చాడు. దీంతో సంబంధించిన డీటెయిల్స్ లీక్ అయిపోయాయి . మొన్నటి వరకు లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో కనిపించిన మహేష్ ఇప్పుడు ట్రిమ్ చేసుకొని చాలా స్టైలిష్ గా కనిపించారు . దీంతో రాజమౌళి సినిమాలో ఇదే లుక్స్ లో కనిపించబోతున్నాడు అన్న ప్రచారం ఊపొందుకుంది. అంతేకాదు రాజమౌళి ఇలాంటి కామెంట్స్ పై సీరియస్ అవుతున్నారట . ఎంత ట్రై చేసినా మహేష్ లుక్స్ ఆపలేకపోతున్నానే అంటూ కోపంగా ఉన్నారట..!!