జైలు నుంచి విడుదలైన హేమలో ఈ మార్పు గమనించారా..ఫ్యాన్స్ భలే “కీ” పాయింట్ పట్టేసారే..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్ లో నటించి ఎన్నో సినిమాల్లో మెప్పించింది . ఒక అక్క పాత్రలో హీరోయిన్ కి తల్లి పాత్రలో అత్తపాత్రలో వదిన పాత్రలో కమెడియన్ రోల్ లో ఆమె కనబరిచిన పెర్ఫార్మెన్స్ మరి ఎవ్వరు చేయలేరు అనే చెప్పాలి . చాలా చాలా జోవియల్ గా సరదాగా ఉండే హేమ ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ప్రముఖ నటి హేమ పేరు హైలెట్గా మారింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యారు . కానీ అందరికన్నా నటి హేమ పేరుని ప్రధానంగా చేసి హైలెట్ చేశారు కొందరు జనాలు .

రేవ్ పార్టీలు నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా నిర్ధారణ కావడంతో ఆమెను బెంగుళూరు సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారు . అంతేకాదు ఆమెను రిమాండ్ లో కూడా పెట్టారు . ఈ క్రమంలోని ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు . హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు అని .. అలాగే ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని.. ఆమె తరపున అడ్వకేట్ కోర్టులో బాగానే వాదించారు. దీంతో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయారు. ఈ క్రమంలోని ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపించిన ఆధారాలను సిసిబి కోర్టుకి అందించింది .

ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీనితో శుక్రవారం ఆమె జైలు నుంచి విడుదలయ్యారు . అయితే ఒకప్పుడు హేమ అంటే ఫైర్ బ్రాండ్.. ఆమెను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారు అని కూడా ఆమెకు టెస్ట్ చేసే ముందు వాదించింది.. కానీ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మాత్రం హేమ చాలా సైలెంట్ గా ఉండిపోయింది . దీంతో ఆమెలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటో అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు భావిస్తున్నారు . అందుకే నిజా నిజాలు తెలిసే వరకు ఆమెపై మా సభ్యత్వం సస్పెన్షన్ విధించినట్లు కూడా వార్తలు వినిపించాయి . ఇప్పుడు బయటకు వచ్చిన హేమ తనను తాను నిర్దోషి అని ప్రూవ్ చేసుకునే అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు ఫ్యాన్స్..!!