మళ్లీ అదే హీరోతో నటించబోతున్న శ్రీలీల.. ఈసారి అయినా ఆ పని చేస్తుందా..? లేదా..?

శ్రీ లీల .. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ హీరోయిన్.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ ఫేస్ చేసిందో మనం చూసాం. పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. గుంటూరు కారం సినిమాలో నటించి హ్యూజ్ ట్రోలింగ్కి గురైంది . ఆ తర్వాత మెల్ల మెల్లగా తన లైఫ్ను సెటిల్ చేసుకోవడానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేసిన శ్రీ లీల ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తెలుగులో అవకాశాలు అందుకుంటూ వస్తుంది .

నేడు ఆమె పుట్టిన రోజు .. ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నితిన్ తాజాగా నటిస్తున్న సినిమా రాబిన్ బుడ్. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల సెలెక్ట్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చేసింది . భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది . ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండడం గమనార్హం. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు వస్తున్న రాబిన్ హుడ్ కూడా హిట్ అవుతుంది అంటున్నారు నితిన్ ఫాన్స్. అయితే నితిన్ శ్రీ లీల ఆల్రెడీ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటించారు . ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది . ఈ సినిమాలో పెద్దగా నటనను ప్రూవ్ చేసుకోలేకపోయింది శ్రీ లీల. కనీసం ఈసారైనా రాబిన్ హుడ్ సినిమా ద్వారా తన నటనా టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటుందో లేదో శ్రీ లీలా అంటూ జనాలు వెయిట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ మాత్రం అభిమానులకు ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది . చూద్దాం మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మడి స్టేటస్ ఏ లెవెల్ లో మారుతుందో..? డిసెంబర్ 2ఒన సినిమా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్..!!