పవన్ ను వింత కోరిక కోరుతున్న ఫ్యాన్స్.. ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారు తీరుస్తాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మరికొద్ది రోజుల్లోనే పిఠాపురం ఎమ్మెల్యేగా పూర్తి బాధ్యతలు స్వీకరించబోతున్నారు పవన్ కళ్యాణ్ . ఇప్పటికే ఆయన పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై కూడా చెప్పబోతున్నాడట . ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను ఓకే చేసి ఆ షెడ్యూల్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత పూర్తి బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాడట .

అయితే ఈలోపే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనను వింత కోరిక కోరుతున్నారు. హీరోయిన్ సాయి పల్లవి తో ఒక సినిమాలో నటించమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు .. లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి అంటే అందరికీ ఇష్టమే. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత స్టేటస్ సంపాదించుకున్నాడో… ఆ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కొద్ది టైంలోనే సంపాదించుకుంది సాయి పల్లవి. ఇద్దరి విధివిధానాలు ఒకటే .. ఇద్దరి ఆలోచనలు ఒకటే..

ఈ ఇద్దరు కలిసి ఒక్క సినిమాలో అయినా నటిస్తే చూడాలి అన్నది పవన్ ఫ్యాన్స్ కోరిక .. పవన్ పూర్తిగా సినిమాల నుంచి తప్పుకునే లోపు ఒక్కసారైనా ఆ హీరోయిన్ తో నటించు బాసు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . మరి ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారు వాళ్ళ కోరిక తీరుస్తాడో లేదో చూద్దాం.. ప్రసెంట్ ఫుల్ జోష్ లో ఉన్న పవన్ అండ్ మెగా ఫ్యాన్స్. ఆయన గెలవాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జనాలకు ఇది నిజంగానే ఓ బిగ్ మూమెంట్ అని చెప్పాలి..!!