శ్రీలీల బర్త డే స్పెషల్: ఇండస్ట్రీలో అలాంటి ఘనత సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఈమె..సో స్పెషల్..!

శ్రీ లీల ..టాలీవుడ్ లోనే యంగెస్ట్ హీరోయిన్.. అది అందరికీ తెలిసిన విషయమే . అయితే శ్రీ లీల ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ ఆల్ తనకంటే ఏజ్ డబల్ ఉన్న హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలాంటి ఒక రేర్ మూమెంట్ ఏ హీరోయిన్ కూడా అందుకోలేకపోయింది . గతంలో శ్రీదేవి మాత్రమే అలా అందుకోగలిగింది . అయితే శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కానీ శ్రీ లీలా మాత్రం యంగ్ ఏజ్ లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటే వయసులో పెద్దవాళ్ళు అయిన నితిన్ – మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఇలాంటి ఓ రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్గా శ్రీ లీల రికార్డు నెలకొల్పింది. నేడు శ్రీలీల బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ ఆమెకు విష్ చేస్తూ ఇదే రికార్డుని గుర్తు చేస్తున్నారు . ఇలాంటి రేర్ రికార్డ్ క్రియేట్ చేయాలి అన్న ఈ రికార్డు బద్దలు కొట్టాలి అన్న శ్రీలీలా కంటే తక్కువ వయసు ఉన్న హీరోయిన్స్ రావాలి ..అంత చిన్న ఏజ్ లో ఇండస్ట్రీలోకి వచ్చే సాహసం ఎవరు చేయలేరు అని.. ఇక ఈ రేర్ రికార్డ్ ఎప్పటికీ కూడా శ్రీలీల పేరు పైనే ఉండిపోతుంది అంటూ ట్రెండ్ చేస్తున్నారు .

ప్రజెంట్ శ్రీలీల తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది . అదేవిధంగా కోలీవుడ్ లో మూడు సినిమాల్లో నటిస్తుంది . రీసెంట్ గానే రవితేజ సరసన ఒక సినిమాకి సెలెక్ట్ అయింది . అలాగే నితిన్ హీరోగా నటిస్తున్నారు రాబిన్ హుడ్ సినిమాలో సైతం శ్రీ లీలా నే హీరోయిన్గా సెలెక్ట్ అయింది . కోలీవుడ్లో అజిత్ – విజయ్ దళపతి – కార్తీక్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో భాగమైంది . నెక్స్ట్ శ్రీలీల బర్త డే ఆమె ఖాతాలో మంచి మంచి హిట్స్ నెలకొల్పే విధంగా ప్లాన్ చేసుకుంటుంది ఈ కన్నడ బ్యూటీ..!!