ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నిర్మాత నాగవంశీకి కొత్త తలనొప్పులు క్రియేట్ చేస్తుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ గా సూర్యదేవర నాగావంశి ఉన్న విషయం మనకు తెలిసిందే . ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నాడు . అలాగే ఎన్నో సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి డైరెక్షన్లో లక్కీ భాస్కర్ అనే ఒక మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. అంతేకాదు ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీ రిలీజ్ చేయాలి అంటూ డిసైడ్ అయ్యారు . నిజానికి పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజి మూవీ ని సెప్టెంబర్ 27 రిలీజ్ చేయాలి అంటూ ఫిక్స్ అయ్యారు . కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది.
అదే తేదీకి లక్కి భాస్కర్ సినిమాని విడుదల చేయనున్నట్టు అధికారం గా ప్రకటించేసాడు నాగ వంశీ. అయితే ఇప్పుడు అదే తేదీన దేవర సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ 10 రిలీజ్ అవ్వాలి ..సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ తప్పుకోవడంతో ఆ ప్లేస్లో ఎన్టీఆర్ కర్చీఫ్ వేసాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. దీంతో నాగవంశీకి కొత్త టెన్షన్ పట్టుకుంది.. దేవర లాంటి సినిమా రిలీజ్ అయితే లక్కీ భాస్కర్ సినిమా పై చాలామంది జనాలు ఇంట్రెస్ట్ చూపించారు ..ఇది ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పులు క్రియేట్ చేస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!