గుర్తు పెట్టుకోండి..ఈ 5 రోజుల్లో హెయిర్ కట్ అస్సలు చేయించుకోకూడదు..ఎందుకంటే..?

చాలామంది హెయిర్ కట్ చేసుకోవడానికి కూడా రోజులు చూసుకుంటారు . నిజమే అయితే ఈ జనరేషన్ పిల్లలు మాత్రం అలా కాదు ..టైం దొరికిందా..? తీరిక ఉందా..? ఓపిక ఉందా..? వెంటనే హెయిర్ కట్ కి వెళ్ళిపోతారు . అది మంగళవారం – శుక్రవారం టైమింగ్ అని ఆలోచించరు. అర్ధరాత్రి 12 గంటలకు కూడా హెయిర్ కట్ చేయించుకునే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు . అయితే కొన్ని కొన్ని రోజుల్లో అలా హెయిర్ కట్ చేయడం శుభసూచికం కాదు అంటున్నారు పండితులు . మరీ ముఖ్యంగా కొన్ని వారాలలో అస్సలు హెయిర్ కట్ చేయకూడదు అని అది ఇంటి పెద్దకి అలాగే ఇంట్లోని మనుషులకు కలిసి రాదు అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు కొన్ని కొన్ని రోజుల్లో హెయిర్ కట్ చేయించడం మంచిది కాదు అంటున్నారు . అది ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

సోమవారం : సోమవారం నాడు ఎవరైనా సరే హెయిర్ కట్ చేయించుకుంటే వారికి అస్సలు కలిసి రాదట . వారి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట . మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలట .

ఆదివారం : చాలామందికి సెలవు దినం కావడంతో అందరూ ఇదే రోజు హెయిర్ కట్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు . కానీ జ్యోతిష్యుల విశ్లేషణ ప్రకారం ఆదివారం హెయిర్ కట్ చేసుకోవడానికి అంత శుభ సూచికం కాదట .దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట . సండే సెలూన్ కి వెళ్లే వ్యక్తి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అని ఫ్యూచర్లో సరైన నిర్ణయాలు తీసుకోలేరు అని చెప్పుకొస్తున్నారు .

మంగళవారం: హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు ఇది ..అందుకే మంగళవారం హెయిర్ కట్ చేయించుకుంటే మంచిది కాదు అని పలువురు నమ్ముతూ ఉంటారు. ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం చేతి వేలి గోర్లు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదట ..అలా చేస్తే ఆయుష్ తగ్గిపోతుందట .

శనివారం : శని దేవుడికి అంకితం చేసిన రోజు హిందూమతంలో శని దేవుడు న్యాయదేవుడిగా పరిగణిస్తారు.. శని ప్రతి వ్యక్తికి కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే జీవితంలో అడ్డంకులను తొలగించడానికి హిందువులు ఈ దేవుడిని పూజిస్తారు . శనివారం హెయిర్ కట్ చేయించుకుంటే ఆయనకు కోపం వస్తుందట. దీనివల్ల ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి పై నెగిటివ్ ప్రభావం పడుతుందట .

గురువారం : గురువారం నాడు హెయిర్ కట్ చేయించుకుంటే గురు గ్రహ బలహీన పడుతుంది అంటూ చాలామంది నమ్ముతారు. దీని వల్ల ఆ వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట .

అమావాస్య: అమావాస్య రోజున కూడా పిల్లలకి పెద్దలకి జుట్టు కట్ చేయించుకోవడం మంచిది కాదు అంటున్నారు పండితులు .

బుధవారం శుక్రవారం నాడు హెయిర్ కట్ చేయించుకోవడం వల్ల శుభ సూచకాలు జరుగుతాయి అని శుభం కలుగుతుంది అని జ్యోతిష పండితులు చెప్పుకొస్తున్నారు..!!