అయ్యయ్యో..పాపం..బన్నీ కి మరో భారీ ఎదురు దెబ్బ.. ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో ఏమో..?

పాపం ..అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆయన పేరుని ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం కూడా మనకు తెలిసిందే . శుభ్రంగా తన సినిమాలు తాను చేసుకుంటూ ఉన్న మూమెంట్లో ఫ్రెండ్షిప్ అంటూ వైసీపీ కాండిడేట్ శిల్పా రవికి సపోర్ట్ చేసి అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు జనసేన ఫ్యాన్స్ కి నెగిటివ్గా మారిపోయాడు . ఆయన చేసిన దాంతో తప్పు ఏమీ లేకపోయినా సరే పలువురు మెగా జనసేన ఫ్యాన్స్ ఆయనను తప్పు చేశారు అంటూ వేలెత్తి చూపిస్తున్నారు. కొంతమంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడం మరింత సంచలనంగా మారింది .

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. పుష్ప2తో తన తలరాతను మార్చేసుకోవడానికి డిసైడ్ అయిన అల్లు అర్జున్ కు భారీ షాక్ తగిలినట్టు ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. నిజానికి అన్ని బాగుంటే ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కావాలి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు సుకుమార్. అయితే కొన్ని కొన్ని సీన్స్ చేయడం కారణంగా అదే విధంగా ప్రెసెంట్ బన్నీ పై జనాల్లో నెలకొన్న నెగెటివిటీ కారణంగా ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.

సుకుమార్ కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నారట . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో రిలీజ్ చేయాలి అంటూ ఫిక్స్ అయ్యారట. పుష్ప వన్ కూడా రిలీజ్ అయింది డిసెంబర్ 17న.. అదే తేదీన ఈ సినిమా కూడా రిలీజ్ చేయాలి అంటూ భావిస్తున్నారట . దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ఈ వార్త ట్రెండ్ అవుతుంది..!!