ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. గతంలో బన్నీకి కూతురుగా.. ఇప్పుడు బన్నీ సాంగ్ తో.. ?!

తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించి ఎంతోమంది ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే రెగ్యులర్గా సినిమాలు చేస్తూ లైమ్‌ లైట్‌లో కొన‌సాగుతారు. కొంతమంది ఒకటి ఆర సినిమాలతో సరిపెట్టుకొని ఇండస్ట్రీకి దూరమవుతారు. ఇక కొన్నేళ్ళ‌ తర్వాత సోషల్ మీడియాలో మెరుస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిస్తారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయి వారు కనిపిస్తూ ఉంటారు. ఇక తాజాగా అలా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..? అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీలో బన్నీకి కూతురుగా నటించింది.

Son of Satyamurthy Little Cute Girl Baby Vernika unseen Photos Images  Collection | 25CineFrames

ఇంత‌కి ఆ సినిమా మ‌రేదోకాదు.. సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమాలో అల్లు అర్జున్ అన్నయ్య కూతురుగా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుజ్జి పాప గుర్తుందా.. త‌న‌ క్యూట్ లుక్స్ తో మాస్మ‌రైజ్ చేసింది. ఇంతకీ ఈ పిల్ల పేరు చెప్పలేదు కదా ఆమె వెర్నిక‌. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలను కనిపించి ఆకట్టుకుంది. మళ్లీ ఏ సినిమాలోను కనిపించ‌లేదు. ఇక‌ ఇన్నాళ్ల తర్వాత మ‌ళ్ళీ బ‌న్ని పాటతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది.

పుష్ప 2 నుంచి తాజాగా రిలీజ్ అయిన కపుల్ సాంగ్ సూసైకి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో పాపులార్టీ దక్కించుకుందో తెలిసిందే. ఈ పాటలో అల్లు అర్జున్, రష్మిక మందన కలిసి వేసిన ఒక స్టెప్ తెగ ట్రెండింగ్ గా మారింది. ఈ స్టేప్‌ను ఆడియన్స్ నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది రీ క్రియేట్ చేస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెర్నిక కూడా సూసైకి పాటికి డ్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ ఇన్‌స్టా చూసిన నెటిజన్స్ అంతా అమ్మ‌డును గుర్తుపట్టి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మ‌డు టీనేజ్ కి వచ్చిన అదే క్యూట్ నెస్‌తో ఆక‌ట్టుకుంటుంది.