కంచె సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి పరిచయమైంది ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌కు జంటగా నటించిన ప్రగ్యా తన మొదటి సినిమాలోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ప్రగ్యకు వరుస ఆఫర్స్ క్యూ కడతాయని అంతా భావించారు. అయినప్పటికీ ఈ అమ్మడుకు ఊహించిన రేంజ్ లో టాలీవుడ్ అవకాశాలు రాలేదు. ఒకటి, అర సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చిన కెరీర్‌కు అస్సలు ఉపయోగపడలేదు.
ఇక చాలాకాలం గ్యాప్ తర్వాత బాలకృష్ణతో అఖండ సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో మరోసారి లైమ్ లైట్‌లో కనిపించింది. అయితే తర్వాత మళ్లీ ఈ అమ్మడు నుంచి ఒక్క సినిమాపై అప్డేట్ కూడా రాలేదు. తాజాగా అందుతున్న వార్తల ప్రకారం ప్రగ్య ఓ స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. ఏ సినిమా అని అనుకుంటున్నారా.. ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఖేల్ ఖేల్ మే సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు.
అందులో తాప్సి, వాణి కపూర్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ఇక మూడో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ను మేకర్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కంచెతో సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రగ్యా.. దాదాపు 10 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో అవకాశాన్ని దక్కించుకుంది. త్వరలోనే ఆమె పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ చేసి ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ న్యూస్ తెలిసిన అభిమానులంతా ప్రగ్యాకు ఎప్పటికైనా మంచి ఫ్యూచర్ ఉంటుందని.. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని.. అలాంటి టాలెంటెడ్ బ్యూటీకి అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఈ సినిమాతో అయినా ఆమెకు మంచి బ్రేక్ వస్తే బాగుండు అంటూ తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.