ప్రమాణస్వీకారం స్టేజిపై మోదీ తనతో ఏం చెప్పాడో రివిల్ చేసిన చిరు.. ఆయన ఏమన్నారంటే..?!

ఎపి సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం మహోత్సవాలు గ్రాండ్ లెవెల్ లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి ప్రమాణ స్వీకారం ఓక ఎతైతే.. ఇదే ప్రమాణ స్వీకారం వేడుకలు చిరు కూర్చున్న దగ్గరికి మోడీ వెళ్లి మరి ఆయన పలకరించడం మరో రేంజ్ లో హైలెట్‌గా నిలిచింది. అయితే చిరు దగ్గరికి వెళ్లిన మోడీ ఆ సమయంలో మెగాస్టార్‌తో ఏం మాట్లాడి ఉంటాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఇప్పటికే మొదలై ఉంటుంది. అయితే ఆ క్యూరియాసిటీనే కిల్ చేస్తూ తాజాగా మోదీ తనతో ఏం చెప్పాడో వివరించాడు మెగాస్టార్.

Pawan Kalyan and Chiranjeevi came together on stage, after seeing what PM  Modi did, you will also say, 'Wow what a thing' – Tezzbuzz

చిరంజీవి ఆ మ్యాట‌ర్ చెప్పడమే కాదు.. మోడీ తనతో మాట్లాడిన మాటలకు అక్షర రూపం ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ట్విట్ షేర్ చేసుకున్నాడు. మోడీ గారు మాట్లాడిన మాటలు కలకాలం గుర్తుండిపోయే మధుర‌ జ్ఞాపకాలు అంటూ ఆయన ఎమోషనల్ కోట్ క్యాప్షన్ గా జోడించాడు. ఇక ఎలక్షన్స్ తర్వాత సక్సెస్ సాధించిన పవన్‌ను మెగాస్టార్ ఇంటికి పిలిచి మరి సత్కరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు నెటింట తెగ వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియోని చూసిన నరేంద్ర మోడీ.. అన్నదమ్ములు ఆప్యాయత, ప్రేమానురాగాలు చూసి ఎమోషనల్ అయినట్టు వివరించాడట‌.

Telugu superstar Chiranjeevi and politician Pawan Kalyan hug PM Narendra  Modi at the swearing in ceremony of Chandrababu Naidu

అంతేకాదు కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పవన్, చిరు మధ్య ఉన్న ప్రేమను బంధాలు భారత సంస్కృతి, సాంప్రదాయాలని, కుటుంబ విలువల‌ని ప్రతిబింబించేలా ఉన్నాయంటూ ఆయన భావించారట. ఇదే విషయాన్ని ప్రమాణస్వీకారం వేదికపై చిరుతో.. మోడీ చెప్పారని.. అయితే మోడీ తనతో చెప్పిన ఈ మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయంటూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. తమ అన్నదమ్ముల ప్రేమ గురించి మోడీ మాటలలో వినడం ఎంతో ఆనందాన్ని కలిగించిందంటూ వివ‌రించాడు మెగాస్టార్.