‘ కన్నప్ప ‘ టీజర్ వచ్చేసిందోచ్.. శివుడిగా ఎవరి నటిస్తున్నారో తెలుసా(వీడియో)..?!

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ కన్నప్ప పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా మహాశివుడి పరమ భక్తుడు కన్నప్ప జీవిత ఆధారంగా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ప్ర‌ధాన పాత్ర క‌ట‌ప్ప రోల్ మంచు విష్ణు న‌టిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాల్లో సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలో నుంచి చాలామంది ప్రధాన తారాగణం అంతా కీలకపాత్రలో నటిస్తున్నారు.

ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శివరాజ్ కుమార్ ఇలా ఎంతోమంది స్టార్ హీరోస్ సినిమాలో భాగం కావడంతో సినిమా సెట్స్‌ పైకి వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అన్ని సినిమాల్లో టీజర్ల లాగా యూట్యూబ్ లో రిలీజ్ చేయకుండా కేవలం కొన్ని లిమిటెడ్ థియేటర్స్ లో మాత్రమే ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. దీంతో అందరూ ఈ టీజర్ ను చూడడానికి వీలు లేకుండా పోయింది. కాగా టీజర్ లోని కొన్ని షాట్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

How stylist Leepakshi brought the essence of Lord Shiva to Akshay Kumar's OMG 2 character - India Today

ఈ షాట్ లో ప్రతిష్టాత్మక కన్నప్పలో శివుడిగా ఎవరు కనిపించనున్నారు అనే విషయంపై క్లారిటీ వచ్చింది. టీజర్ లో కనిపించిన లుక్ ప్రకారం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడుగా నటించినట్లు తెలుస్తోంది. ఇక ఈ టీజర్ లో ప్రభాస్ కళ్ళు మాత్రమే కనిపించేలా చేసి ఆయన నటిస్తున్న పాత్ర పై సస్పెన్స్ ఉంచారు మేకర్స్. ఇక టీజర్ విషయానికి వస్తే విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ లెవెల్ లో ఉండడం విశేషం. క‌న్నప్ప ను వీరుడిగా చూపిస్తూ వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా పాన్ ఇండియాలో మంచి సక్సెస్ అందుకుంటుంది అనే అభిప్రాయం ప్రేక్షకులకు వస్తుంది. మరి కన్నప్ప ఫుల్ టీజర్ యూట్యూబ్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.