“ప్లీజ్ దయచేసి ఆ పని మాత్రం చేయొద్దు”..ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న సరే అది చాలా చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది అన్న నమ్మకం అభిమానుల్లోనే కాదు ..జనాలలో కూడా ఎప్పుడూ ఉంటుంది . అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించారు జనాలు . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ అతి భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఏకంగా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు .

పవన్ కళ్యాణ్ కొణిదల అనే నేను అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ చెవుల్లో మారుమ్రోగిపోతున్నాయి. ఆ మూమెంట్ కోసం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కాగా అలాంటి ఓరేర్ మూమెంట్ అచీవ్ చేసిన సందర్భంగా సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కి కావాల్సిన వాళ్ళు అందరూ కూడా ఆయనను కలిసేందుకు జనసేన ఆఫీస్ కి వస్తున్నారు. ఈ క్రమంలోనే బొకేలు ..శాలువాలు, పూలమాలలు తెస్తున్నారు .

అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ” తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చెబుతూ నన్ను కలవడానికి చాలామంది వస్తున్నారు.. వచ్చినవాళ్లు పూలమాలలు.. బొకేలు ..శాలువాలు తెస్తున్నారు.. దయచేసి అలా తేవద్దు నేనే మిమ్మల్ని కలవడానికి మీ ఊరికి వస్తాను ..నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి నేనే మిమ్మల్ని కలుస్తాను ” అంటూ ఆ ప్రెస్ నోట్లో రాసుకొచ్చాడు . ప్రజెంట్ ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ ఏపీ సినీ రాజకీయాలలో హైలైట్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఏం పని చేసిన సరే చాలా పకడ్బందీగా క్లియర్ గా చేస్తాడు అని చెప్పడానికి ఇది మరొక ఎగ్జాంపుల్ అంటున్నారు జనాలు..!!