“లావణ్య త్రిపాఠి కి మరో పెళ్లి ప్రపోజల్ “..మెగా కోడలు ఆన్సర్ కి అందరూ షాక్..!

లావణ్య త్రిపాఠి.. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ టాప్ హీరోయిన్ అని మాత్రం చెప్పలేం . చాలా చక్కగా ఉంటుంది.. అందంగా మాట్లాడుతుంది.. అందంగా నటిస్తుంది ..లిమిట్స్ క్రాస్ చేయకుండా తన పని తను చూసుకుంటుంది . ఇంతవరకు అందరికీ తెలిసిందే.. కాగా లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఏకంగా గుట్టుచప్పుడు కాకుండా ఐదేళ్లు ప్రేమాయణం నడిపింది. ఈ ప్రేమాయణానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న సరే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసారు లావణ్య – వరుణ్ .

ఫైనల్లీ నిశ్చితార్థం ముహూర్తం ఫిక్స్ చేసుకొని పెళ్లి కార్డు తో మీడియా ముందుకు వచ్చారు. వీళ్ళ పెళ్లి ఇటలీలో గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగింది . వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ అప్పట్లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో కూడా మనం చూసాం. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . లావణ్య త్రిపాఠి కి రీసెంట్గా కాళ్లకు గాయమైంది . ఈ క్రమంలోనే ఇంటిపట్టునే ఉంటుంది . కాగా తాజాగా లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది.

లావణ్య కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చాడు ఓ నెటిజన్. “ఈ జన్మ కంటే వరుణ్ ని చేసేసుకున్నావ్.. వచ్చే జన్మకి అయినా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..?” అంటూ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. దీనికి లావణ్య త్రిపాఠి సైతం అద్దిరిపోయే ఆన్సర్ ఇచ్చింది . “పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు ..దానిని నేను నమ్ముతున్నాను. ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా నా భర్త వరుణ్ తేజ్ అంటూ చాలా ఎమోషనల్ గా టచ్ చేసింది”. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె ఇచ్చిన రిప్లై హైలైట్ గా మారింది. లావణ్య త్రిపాథి వరుణ్ ఎప్పుడు ఇదే విధంగా కలిసి ఉండాలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు అభిమానులు . మరికొందరు మాత్రం మేటర్ చెడే వరకు అందరికీ ఇలానే అనిపిస్తుంది.. మొదట్లో హీరోయిన్ సమంత కూడా ఇదే విధంగా అన్నింది ఇప్పుడు విడాకులు తీసేసుకుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!