“సమంత పై కోపంగా ఉన్న నయనతార”.. అంత తప్పు ఏం చేసిందంటే..?

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. సమంత పై హీరోయిన్ నయనతార కోపంగా ఉందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి కారణం రీసెంట్గా నయనతార హోల్డ్ లో పెట్టుకున్న ఆఫర్ను తక్కువ రెమ్యూనరేషన్తో సమంత ఓకే చేయడమే అంటూ తెలుస్తుంది. హీరోయిన్ సమంత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. పలు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది .

ఈ క్రమంలోనే హీరోయిన్ సమంత తాజాగా ఓ కోలీవుడ్ సినిమాకు సైన్ చేసిందట . ఇది మొత్తం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కావడం గమనార్హం. నిజానికి ఈ మూవీలో హీరోయిన్గా మొదట నయనతారను అనుకున్నారట మేకర్స్. అయితే ఆమె ఎలాంటి కండిషన్స్ పెడుతుంది..? ఎంత హై రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..? అనే విషయం అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే నయనతార రేంజ్ కి తూగ లేని ఆ మేకర్స్.. సమంతను అప్రోచ్ అవ్వగా..

తక్కువ రెమ్యూనరేషన్ కి ఆమె సినిమా యాక్సెప్ట్ చేసిందట . దీంతో నయనతారను కాదు అంటూ మేకర్స్ సమంతకు ఓకే చేశారట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి నయనతార – సమంతల మధ్య మంచి బాండింగ్ ఉంది . అయితే ఈ సినిమా పుణ్యమాంటూ అది కాస్త చెడిపోయే వరకు వెళ్లిపోయింది అంటున్నారు ఫ్యాన్స్ . కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ న్యూస్ యమ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!!